సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి, అలాగే ఊహించని విపత్తులు కూడా ఉంటాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం కొత్తేమీ కాదు. కానీ, పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒక్క శాతం కూడా తిరిగి రాకపోతే అది ఆ చిత్ర యూనిట్‌కు కోలుకోలేని దెబ్బ అంటే చెప్పాలి. తాజాగా హాలీవుడ్‌లో ఒక సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా 1400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఓ చిత్రం, కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసి ప్రపంచ సినిమా చరిత్రలోనే ‘బిగ్గెస్ట్ డిస్టర్జా’గా నిలిచింది.
ఆ సినిమా మారేదో కాదు.. హాలీవుడ్ స్టార్ నటుడు ఆంథోనీ మాకీ ప్రధాన పాత్రలో నటించిన ‘డెసర్ట్ వారియర్’ (డెసర్ట్ వారియర్). సౌదీ అరేబియా, బ్రిటన్, అమెరికా దేశాల సంయుక్త నిర్మాణంలో 7వ శతాబ్దపు అరేబియా పీరియడ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు 150 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1400 కోట్లు) భారీ వ్యయంతో రూపొందించబడిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, విడుదలయ్యాక సీన్ రివర్స్ అయింది.
ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం ప్రభావం చూపలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం కేవలం 4.72 లక్షల డాలర్లు అంటే సుమారు 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దీంతో నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు తప్పలేదు. నిర్మాణంలో జరిగిన జాప్యం, దర్శకుడికి మరియు నిర్మాణ సంస్థకు మధ్య వచ్చిన విభేదాలే ఈ దారుణమైన పరిస్థితికి కారణమని సినీ విశ్లేషకులు.
సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, ఎడిటింగ్ దశలో చాలా కాలం పాటు పెండింగ్‌లో పడిపోయింది. దర్శకుడు రూపెర్ట్ వ్యాట్ అనుకున్న కథకు, చివరగా వెండితెరపై ప్రదర్శించిన వెర్షన్‌కు చాలా వ్యత్యాసం ఉన్న ప్రేక్షకులు దీనిని ఆదరించలేకపోయారు. సినిమా పదే పదే రీ-షూట్ చేయడం వల్ల బడ్జెట్ అదుపు తప్పిందని, చివరకు అవుట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి కనీస స్పందన కరువైందని తెలుస్తోంది.
హాలీవుడ్ మేకింగ్ విలువల పరంగా సినిమా గ్రాండ్‌గా కనిపించడం, ప్రమోషన్లు చేయడం కూడా మరో మైనస్ పాయింట్‌గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఇంత భారీ బడ్జెట్ పెట్టి కనీసం ప్రమోషన్లు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆంథోనీ మాకీ వంటి నటుడు, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈ చిత్రం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ప్రస్తుతం ఈ సినిమా ఫలితం హాలీవుడ్ నిర్మాణ సంస్థలను ఆందోళనలోకి నెట్టింది. ఎంత పెద్ద స్టార్లు ఉన్నా, ఎంత భారీ బడ్జెట్ పెట్టిన కథా కథనాలు మరియు పక్కా ప్లానింగ్ లేకపోతే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ‘డెసర్ట్ వారియర్’ నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఓటిటిలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.