
బిహార్‌లోని మొకామా నియోజకవర్గ పరిధిలోని నద్వాన్ గ్రామం ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. ఎమ్మెల్యే అనంత సింగ్ కుమార్తె శివాంగి వివాహ వేడుకకు దాదాపు రూ. 50 కోట్ల ఖర్చుతో, పది ఎకరాల విస్తీర్ణంలో తాజ్‌మహల్ నమూనాను తలపించే భారీ సెట్‌ను నిర్మించారు. 250 రకాల వంటకాలు, 50 లక్షల గులాబ్ జామూన్లు, కచేరీలు, గుర్రపు పందెం బహుమతులు వంటి హంగులతో ఈ వేడుక అత్యంత విలాసవంతంగా జరిగింది.
అయితే, బయట నుంచి చూసేవారికి ఇది అద్భుతమైన వేడుకలా కనిపించినా, క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలు సామాన్య ప్రజల కష్టాలు, భద్రతా లోపాలు, ఆర్థిక అసమానతలను కళ్లకు కట్టాయి.వివాహ వేడుకల్లో భోజనాల వద్ద నెలకొన్న పరిస్థితులు ఎంతో ఆవేదన కలిగించేలా ఉన్నాయి. నాలుగు నుంచి ఐదు లక్షల మంది వ్యక్తులు ఒక్కసారిగా చేరుకోవడంతో క్రమశిక్షణ గాడి తప్పింది. క్యూలు, సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడంతో జనం తోసుకుంటూ ముందుకు సాగారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో వంట సిబ్బంది ఎత్తైన వేదికలపై నుంచి విస్తర్లను, ప్లేట్లను గాలిలోకి విసిరే పరిస్థితి వచ్చింది.
కింద ఉన్న వాటిని అందుకోవడానికి ఎగ జనం. ఇంతకంటే బాధాకరమైన విషయం నేల, తోపులాటలో పడి మట్టిలో కలిసిపోయిన రోటీలు, కూరగాయలను కూడా ప్రజలు ఏరుకుని తిన్న దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కేలా చేశాయి. ఒక పక్క కోట్ల రూపాయల విలాసవంతమైన ఖర్చు, మరో పక్క మట్టిలో పడిన ఆహారం కోసం పోరాడుతున్న జనాల స్థితి మన సమాజంలో తీవ్ర అసమానతలను గుర్తుచేస్తున్నాయి.
ప్రజలు ఈ వేడుకకు వచ్చిన తీరు, ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా బయటపడ్డాయి. వేడుకలను చూడటానికి రోడ్లపై సుమారు 10 మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంపులో చోటు దొరకని కొందరు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా హైటెన్షన్ కరెంట్ టవర్లు, చెట్లు ఎక్కి వేడుకను వీక్షించారు.
ఇది కూడ చదవండి: ఎన్డీయేకు జగన్ మద్దతు: షరతు నిజంగానే వర్తిస్తుందా?
ఇది ఎంత ప్రమాదకరమో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే, పింక్ కార్పెట్ పైకి పాము రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మరోవైపు కచేరీలో గాయకులపై కరెన్సీ నోట్ల వర్షం కురవగా, సిబ్బంది వాటిని చీపుర్లతో ఊడ్చి ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ఘటనల ప్రభావం సామాన్య ప్రజలపై స్పష్టంగా కనిపించింది.

ఆకలి, కనీస అవసరాల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు, గౌరవం లేకుండా ఆహారం కోసం ఎగబడాల్సిన దుస్థితి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఒకే వేదికపై విలాసం, దారిద్ర్యం పక్కపక్కనే కనిపించడం ప్రజల్లో ఆవేదన, అసంతృప్తిని పెంచుతోంది. వేడుకల పేరుతో భారీ ఖర్చుల కంటే, కనీస భద్రత, క్రమబద్ధమైన ఏర్పాట్లు ఎంత అవసరమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
మీకు నచ్చవచ్చు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఆమోదం.!
మీకు నచ్చవచ్చు: జగన్ సొంత ఊరు బలపనూరు: అక్కడ వైసీపీకి ఎదురుగాలే.!
[ MLA Ananta Singhs daughters wedding, Rs.50 crore wedding ceremony, People ate bread that fell in the mud, Bihar wedding food riot, Nadwan village wedding ceremony, People rushed for food ]
