Home ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ : బాదుడు లేకున్నా.. ఆదాయం పెరిగింది – Andhra Waves

ఆంధ్ర ప్రదేశ్ : బాదుడు లేకున్నా.. ఆదాయం పెరిగింది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


ఆంధ్ర ప్రదేశ్: ప్రజలపై పన్నుల భారం వేయకుండా.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం సాధ్యమేనా.. సాధారణంగా ప్రభుత్వాలకు ఆదాయం పెరగాలంటే పన్నులు పెంచాలి. కొత్త చార్జీలు విధించాలి.. కానీ ఏపీలో ఇప్పుడు మరో విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజల మీద పన్నుల భారం వేయకుండా.. వ్యవస్థలో ఉన్న లీకేజీలను అరికట్టింది. పన్నుల్లో వసూళ్లను పెంచింది. ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో ఏపీలో ఆదాయం పెరిగింది. తాజాగా విడుదలైన ఈ అంశంపై ఆసక్తి రేకెత్తిస్తోంది. 2026 […]

ఆంధ్ర ప్రదేశ్: ప్రజలపై పన్నుల భారం వేయకుండా.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం సాధ్యమేనా.. సాధారణంగా ప్రభుత్వాలకు ఆదాయం పెరగాలంటే పన్నులు పెంచాలి. కొత్త చార్జీలు విధించాలి.. కానీ ఏపీలో ఇప్పుడు మరో విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజల మీద పన్నుల భారం వేయకుండా.. వ్యవస్థలో ఉన్న లీకేజీలను అరికట్టింది. పన్నుల్లో వసూళ్లను పెంచింది. ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో ఏపీలో ఆదాయం పెరిగింది. తాజాగా విడుదలైన ఈ అంశంపై ఆసక్తి రేకెత్తిస్తోంది. 2026 నవంబర్ 23 నాటికి ఏపీ ప్రభుత్వ సొంత ఆదాయం 74,342 కోట్లకు చేరుకుంది. గత ఎడాది ఇదే సమయానికి వచ్చిన 62,604 కోట్లతో పోల్చి చూస్తే దాదాపు 11738 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. అంటే 18.7% వృద్ధి నమోదైంది.

2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం 1,27,506 కోట్ల సొంత ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 23 నాటికి అందులో 58 శాతాన్ని కలిగి ఉంది. ఇందులో పన్నుల ఆదాయం 53,692 కోట్ల నుంచి 63,796 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 10,104 కోట్లు. పన్నేతర ఆదాయం కూడా 1,330 కోట్ల నుంచి 2,091 కోట్లకు పెరిగింది. ఈ పరిధిలో31.3 శాతం వృద్ధి నమోదైంది.

రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయంలో కూడా 18.3% వృద్ధి నమోదైంది. జీఎస్టీ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 3694 కోట్లు పెరిగాయి. మొత్తంగా 24,073 కోట్లకు చేరుకున్నాయి. దాదాపుగా 18.1 శాతం వృద్ధి నమోదైంది. ప్రభుత్వాదాయాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా పన్నుల వసూళ్లలో ఉన్న లోపాలను గుర్తించాలని.. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రభుత్వానికి రావలసిన ఆదాయం మధ్యలోనే ఆగిపోకుండా చూసే విధంగా.. పన్నుల ఎగవేత లేకుండా.. అక్రమ లావాదేవీలను గుర్తించాలని చంద్రబాబు సూచించడంతో అధికారులు ఆ పని చేశారు. కృత్రిమ మేధ.. డేటా డిజిటల్ వ్యవస్థల ద్వారా పన్నుల వసూళ్లను అంచనా వేయడానికి.

ఆదాయాన్ని తీసుకొచ్చే శాఖల పనితీరును ప్రతివారం సమీక్ష జరపాలని.. లోపాలను సరిదిద్దాలని.. మార్చి 2027 నాటికి ఆదాయ వ్యవస్థలను మరింత నివృత్తి చేయాలని చంద్రబాబు సూచించారు. ఆదాయం పెరిగింది. పట్టణ ప్రాంతాల ఆస్తి పన్నుల వసూళ్ల విషయంలో ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఏఐ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆస్తుల వివరాలు.. పన్నుల మదింపు.. వసూళ్లలో ఉన్న వ్యత్యాసాలను గుర్తించారు. వాణిజ్య పన్నుల శాఖకు కూడా ఏప్రిల్ నుంచి నాలుగు విభాగాల్లో ఏఐ సాంకేతికతను ఉపయోగించడం ప్రారంభించింది. రిటర్న్ ల పరిశీలన.. సాంకేతిక అంశాల్లో సాంకేతికతను ఉపయోగించడంతో ఆదాయం పెరిగింది. మద్యం తయారీ నుంచి విక్రయాల వరకు ప్రతి దశను ఎలక్ట్రానిక్ విధానంలో పర్యవేక్షించాలని చంద్రబాబు.. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఫలితంగా పన్ను ఆదాయం పెరిగింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird