.webp)
తిరుమలేశునికి ఓ భక్తుడు దాదాపు 160 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించడానికి ముందుకు వచ్చారు. సుమారు 121 కిలోల బరువు కలిగిన బంగారు ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన కానుకగా సమర్పించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ విషయంపై టీటీడీతో ఆయన చర్చించి విరాళానికి సంబంధించిన వివరాలను తెలియజేసినట్లు సమాచారం.
అదాల, స్వామివారి కైంకర్యాలు, అలంకరణల కోసం ప్రత్యేకంగా 9 సెట్లలో 45 బంగారు ఆభరణాలను ఆ భక్తుడు రూపొందించినట్లు సమాచారం. తిరుమల చరిత్రలో ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను ఒకేసారి కానుకగా అందుకోవడం ఇదే తొలి సారి అవుతుంది. ఈ అపురూప విరాళాన్ని అందజేయడానికి ఈ నెల 26న ముహూర్తం ఖరారైనట్లు చెబుతున్నారు.
ఈ విరాళానికి సంబంధించి టీటీడీ అధికారిక అధికారిక ప్రకటనలు, కార్యక్రమ షెడ్యూల్ వివరాల కోసం భక్తులు, ప్రజలు రూపొందించారు. నవంబర్ 26న జరగనున్న ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు అవుతారని అంటున్నారు.

ఆ భక్తుడు చంద్రబాబు సమక్షంలో తన విరాళాన్ని టీటీడీకి అందించాలని భావించారు. వివరాలు తెలుసుకున్న చంద్రబాబు అందుకు సమ్మతించినట్లు చెబుతున్నారు. అయితే ఈ విరాళ సమర్పణ ఘట్టం పూర్తయ్యాక, ఆభరణాలకు సంబంధించిన వివరాలపై స్పష్టత లభించనుంది. ర్తల ద్వారా వీక్షించేందుకు ఆసక్తిగా భక్తులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం: ఓ భక్తుడి వితరణ: ఎప్పుడంటే.?
తాను స్థాపించిన కంపెనీ లాభాల్లో వాటాగా శ్రీవారికి ఈ కానుక సమర్పించేందుకు ఆ భక్తుడు నిర్ణయించుకున్నారు. అయితే ఇంత భారీ విరాళం కానుకగా ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆ భక్తుడు తన పేరు బయటకు రాకూడదని కోరడంతో టీటీడీ ఆయన వివరాలను వెల్లడించడం లేదు.
.webp)
దీంతో తిరుమల ఆలయ చరిత్రలోనే భారీ కానుకను సమర్పించనున్న భక్తుడు అజ్ఞాత భక్తుడిగా తెరవెనుక ఉండనున్నారు. అడలా ఉంటె.. శ్రీవారి అలంకరణకు ఉండేలా ఈ భక్తుడు సమర్పించనున్న ఆభరణాలు ఉన్నాయి.
మీకు నచ్చవచ్చు: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు నవంబర్ 27న విడుదల.!
ఆయుర్వేద వైద్య కేంద్రంగా తిరుపతి: 24 రాష్ట్రాలతో పోటీలో ఏపీ ముందడుగు.!
[Unknown Devotee, Gold donation, TTD, ChandrababuNaidu, resence, TeluguOne]
