Home సినిమా తండ్రికి షాక్! బిడ్డపై తల్లికే హక్కు? – Andhra Waves

తండ్రికి షాక్! బిడ్డపై తల్లికే హక్కు? – Andhra Waves

by andhra andhrawave
0 comments
తండ్రికి షాక్! బిడ్డపై తల్లికే హక్కు?


పెళ్లి కాకుండా ఒక మహిళ, పురుషుడికి బిడ్డ పుడితే.. ఆ బిడ్డ సంరక్షణ బాధ్యత ఎవరికి ఉంటుంది? తల్లికా? తండ్రికా? ఇద్దరిలో ఎవరికి ఎక్కువ హక్కు ఉంటుంది? ఇలాంటి ప్రశ్నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి కాకుండా పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో.. బిడ్డ సంరక్షణలో తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. ఒక జర్మనీ మహిళ, భారతీయ వ్యక్తికి పుట్టిన నాలుగేళ్ల చిన్నారి విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ బిడ్డను తల్లికి అప్పగిస్తూ వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది? తండ్రి ఎందుకు అభ్యంతరం చెప్పారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ తీర్పు అందరికీ వర్తిస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కేసులో ఒక జర్మనీ మహిళ, భారతీయ వ్యక్తి పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఆ మహిళ సింగపూర్‌లో ఉద్యోగం చేస్తోంది. తన కుమారుడిని కూడా తనతో పాటు సింగపూర్‌కు తీసుకెళ్లాలని భావించింది. కానీ బాలుడి తండ్రి దీనికి అంగీకరించలేదు. చిన్నారిని భారత్ దాటి వెళ్లనివ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ బిడ్డ సంరక్షణ హక్కు ఎవరికి ఉండాలనే విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. పెళ్లి కాకుండా పుట్టిన పిల్లల సంరక్షణ విషయంలో తల్లి వాదనకు చాలా బలం ఉందని. అంటే ఇలాంటి సందర్భాల్లో మొదట తల్లి హక్కును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలతో పాటు భారత చట్టాలను కూడా కోర్టు పరిశీలించింది. చివరకు నాలుగేళ్ల చిన్నారిని అతడి జర్మనీ తల్లికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు తల్లికే ప్రాధాన్యత ఇచ్చిందని.. తండ్రికి ఎలాంటి హక్కులు ఉండవని అనుకోకూడదు. ఈ తీర్పు కేవలం తాత్కాలికంగా బిడ్డ సంరక్షణ ఎవరికి అప్పగించాలనే అంశానికి సంబంధించినది. తండ్రి హక్కులు, పిల్లల సంరక్షణకు సంబంధించిన పూర్తి విచారణ ఇంకా ఫ్యామిలీ కోర్టులో కొనసాగవచ్చు. అంటే తుది నిర్ణయం తీసుకునే సమయంలో అన్ని అంశాలను పరిశీలించే అవకాశం ఉంటుంది.

ఈ కేసులో సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన ఏబీసీ వర్సెస్ ఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ కేసు తీర్పును కూడా గుర్తుచేసింది. అలాగే తాత్కాలికంగా బిడ్డ సంరక్షణ ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించడానికి మూడు ముఖ్యమైన అంశాలను పరిశీలించారు.
మొదటిది.. ఎవరి వాదనకు ప్రాథమికంగా ఎక్కువ బలం ఉందా?
రెండోది.. బిడ్డకు ఎవరి దగ్గర ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?
మూడోది.. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోకపోతే సరిదిద్దలేని నష్టం ఏమైనా జరుగుతుందా?
ఈ మూడు అంశాలను పరిశీలిస్తే విధానాన్నే ట్రిపుల్ టెస్ట్ అంటారు.

ఈ తీర్పులో సుప్రీంకోర్టు బ్రిటన్‌కు చెందిన చిల్డ్రన్ యాక్ట్ 1989ను కూడా ప్రస్తావించింది. ఈ చట్టం ప్రకారం పెళ్లి కాకుండా పుట్టిన పిల్లల విషయంలో తల్లికి ప్రధాన బాధ్యత ఉంటుంది. తండ్రికి కూడా కొన్ని ఆరోగ్య షరతులు నెరవేర్చిన తర్వాత బాధ్యత లభిస్తుంది. అలాగే భారత వారసత్వ చట్టం 1925లోని సెక్షన్ 8ను కూడా కోర్టు ప్రస్తావించింది. పెళ్లి కాకుండా పుట్టిన పిల్లల నివాస సంబంధిత అంశాల్లో తల్లి నివాసానికి ప్రాధాన్యత ఉంటుందని వివరించింది. ఈ అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని పరిశీలించింది.

మొత్తంగా ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఒక కీలక పరిశీలన చేసింది. పెళ్లి కాకుండా పుట్టిన పిల్లల సంరక్షణ విషయంలో తల్లి వాదనకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇది తాత్కాలిక కస్టడీకి సంబంధించిన నిర్ణయం మాత్రమే. తండ్రి హక్కులపై తుది నిర్ణయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. పిల్లల సంరక్షణ విషయంలో వారి ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని అర్థం చేసుకోవాలి.

The post తండ్రికి షాక్! బిడ్డపై తల్లికే హక్కు? iDreamPostలో మొదట కనిపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird