
సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత ప్రయాణం, వారి సామాజిక పోరాటం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఫూలే’ .
సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 27న థియేటర్లలో విడుదలైంది.
ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సుపద క్రియేషన్స్ నిర్మిస్తోంది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరించారు.

విద్య, సమానం, సామాజిక న్యాయం, మహిళా విద్య వంటి అంశాల కోసం ఫూలే దంపతులు సాగించిన పోరాటాన్ని, వారి ఆదర్శప్రాయమైన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆలోచనలను రేకెత్తించే కథాంశంతో రూపొందించబడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ఫూలే దంపతుల సామాజిక సేవ, వారి జీవితాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సమాజంలో మార్పు కోసం పోరాడిన ఇద్దరు మహనీయుల జీవితాలను, వారి ఆశయాలను, వారు ఎదుర్కొన్న అడ్డంకులను మన ముందుకు తీసుకొచ్చే ఒక చరిత్రాత్మక కథనం ‘ఫూలే’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. నేటి యువత, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఫూలే దంపతుల జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి వాటిని గుర్తుచేసుకుంటే ఈ ప్రతి ఒక్కరూ థియేటర్లలో వీక్షించాలని చిత్ర బృందం కోరుతోంది.
