Home సినిమా సినిమాల్లో నటిస్తే.. బయట అలా తాకాల: వైరల్ గా మారిన కీర్తి సురేష్ వ్యాఖ్యలు! – Andhra Waves

సినిమాల్లో నటిస్తే.. బయట అలా తాకాల: వైరల్ గా మారిన కీర్తి సురేష్ వ్యాఖ్యలు! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


హీరోయిన్.. సినిమాలో క్యారక్టర్ కోసం కొంచం గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో కొంచం పొట్టి దుస్తులు ధరించే పరిస్థితి రావచ్చు. క్యారక్టర్ కి తగ్గ రొమాన్స్ పండించడానికి హీరోతో రొమాన్స్ చెయ్యాల్సి వచ్చింది.

దీనితో ఆటోమాటిక్ గా రకరకాల స్పర్సలు తనని చుట్టుముట్టే అవకాశం ఉండవచ్చు. అవన్నీ జరుగుతున్నప్పుడు తక్కువలో 50 మంది వరకు షూటింగ్ మెంబర్స్ ఉండవచ్చు.ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్పే అవకాశం ఒక మహానుభావుడు కల్పించాడు.

తాజాగా ప్రముఖ నటి కీర్తి సురేశ్‌, దర్శకుడు నటుడు మిష్కిన్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట పెద్ద చర్చకే దారితీసింది. చెన్నైలో జరిగిన ‘సత్యవాన్ సావిత్రి’ చిత్ర ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికపై వీరిద్దరూ పక్కపక్కనే ఉండి మాట్లాడుతున్న దృశ్యం బయటకు వచ్చింది. ఆ సమయంలో మిష్కిన్ కీర్తి సురేశ్‌ను ప్రశంసిస్తూ, ఆమె మోకాలు లేదా తొడ భాగం వైపు కొద్దిసేపు చేయి వేసిన క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా పాకింది.

ఆ క్లిప్‌ను చూసిన కొందరు నెటిజన్లు కీర్తి సురేశ్‌ ముఖంలో కనిపించిందంటూ కామెంట్లు చేయడం స్టార్ట్ చేసారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి, సినిమాల్లో నటినటులు సన్నివేశాల కోసం సన్నిహితంగా నటిస్తారు కదా, అలాంటప్పుడు బహిరంగ వేదికపై ఇలాంటి స్పర్శను ఎందుకు తప్పుబడుతున్నారనే తరహాలో ప్రశ్నలు లేవనెత్తారు.

దీంతో కీర్తి సురేశ్ మౌనం వీడి, సోషల్ మీడియా వేదికగా ఘాటుగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె చెప్పింది తమ మధ్య ఉన్నది తండ్రీకూతుళ్ల లాంటి అనుబంధం. నా ముఖంలో మీకు ప్రస్తుతం ఎక్కడ కనిపించింది, మా ఇద్దరి మధ్య ఉన్న తండ్రీకూతుళ్ల బంధం గురించి మేము చెప్పిన మాటలు వినలేదా.ఒకవేళ నిజంగానే నేను కలిగి ఉంటే, సినిమాల్లో నటిస్తాను కాబట్టి బయట కూడా అలాగే ఉండాలా! కొన్ని విషయాలని సరిగ్గా అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

నిజానికి ఆ వేదికపై మిష్కిన్‌ కీర్తి సురేశ్‌పై ఎంతో అభిమానాన్ని కురిపించారు. ఆమె నటనను మెచ్చుకుంటూ ‘నడిగైయర్ తిలగం’ అనే బిరుదు ఇస్తున్నట్లు ప్రకటించారు, తలపై చేయి వేసి ఆశీర్వదించారు. అంతేకాకుండా, కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ‘డోరతీ’లో ఆమె నటనకు మెచ్చి బంగారు ఉంగరాన్ని కూడా బహుమతిగా ఇచ్చింది. షూటింగ్ మొదలైన రెండో మిష్కిన్‌ తన కూతురు ఫోటో చూపించి, తన కూతురు అచ్చం కీర్తిలాగే ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.

కీర్తి సురేశ్‌ స్పందించిన తర్వాత ఆ వివాదం పోస్ట్ పెట్టిన నెటిజన్ తన పోస్ట్‌ను తొలగించి, తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదంటూ క్షమాపణ కోరడం విశేషం.

మీకు నచ్చవచ్చు: పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కలకలం
మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!

[Keerthy Suresh, Mysskin, Sathyavan Savithiri, Tollywood]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird