Home సినిమా బాలకృష్ణకు విశిష్ట పురస్కారం: తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం.! – Andhra Waves

బాలకృష్ణకు విశిష్ట పురస్కారం: తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గుర్తింపు దక్కనుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారానికి ఈ ఏడాది బాలకృష్ణను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన సినీ సేవతో పాటు సామాజిక సేవను గుర్తించి ఈ పురస్కారానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా రంగంలో దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ.. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. మరోవైపు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్‌ ఆసుపత్రి ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా కూడా సేవలందిస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు వైద్య సేవల విషయంలో ఆయన చేస్తున్న కృషిని కూడా ఈ ఎంపికలో ఎంచుకున్నట్లు సమాచారం.

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి ఏడాది కళలు, సాహిత్యం, సామాజిక సేవ, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి విశిష్ట పురస్కారాలను అందజేస్తుంది.

ఈసారి కళ, సేవా రంగాల నుంచి బాలకృష్ణ పేరు ప్రతిపాదించినట్లు, తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: బాలకృష్ణ దాదా లేటెస్ట్ అప్డేట్.. సినిమాలో అదిరిపోయే ట్విస్ట్.!

అయితే ఈ పురస్కారానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే నటుడిగా, ఎమ్మెల్యేగా, క్యాన్సర్‌ ఆసుపత్రితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణకు ఈ పురస్కారం లభిస్తే ఆయన ఖాతాలో మరో గౌరవం చేరినట్లే.

మీకు నచ్చవచ్చు:
ఒసేయ్ రాములమ్మ రీమిక్స్.. థియేటర్లను షేక్ చేయబోతున్న రష్మిక.!
తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.!

[Nandamuri Balakrishna, Telugu University Award 2026, Visishta Puraskaram, Telangana Government]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird