Home ఆంధ్రప్రదేశ్ వైఎస్ షర్మిల: అంగరంగ వైభవంగా షర్మిల కూతురు హల్దీ ఫంక్షన్ – Andhra Waves

వైఎస్ షర్మిల: అంగరంగ వైభవంగా షర్మిల కూతురు హల్దీ ఫంక్షన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


వైఎస్ షర్మిల: ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం ఈనెల 25న జరగబోతోంది. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోమల రఘురాం రెడ్డితో ఆమె వివాహాన్ని గతంలోనే నిర్ణయించారు. 25న బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ వివాహాన్ని అక్కడ కాకుండా.. మరోచోట చేర్చామని ఇప్పటికే షర్మిల ప్రకటన. అయితే వివాహ వేదికను ఇప్పటివరకు బయటికి ప్రకటించలేదు. వివాహ వేదిక […]

వైఎస్ షర్మిల: ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం ఈనెల 25న జరగబోతోంది. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోమల రఘురాం రెడ్డితో ఆమె వివాహాన్ని గతంలోనే నిర్ణయించారు. 25న బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ వివాహాన్ని అక్కడ కాకుండా.. మరోచోట చేర్చామని ఇప్పటికే షర్మిల ప్రకటన. అయితే వివాహ వేదికను ఇప్పటివరకు బయటికి ప్రకటించలేదు.

వివాహ వేదిక కాకపోయినప్పటికీ అంజలి రెడ్డి హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. హల్దీ వేడుకలు వేగంగా అంజలి రెడ్డికి పసుపు పూసి.. మంగళ స్నానాలు చేశారు. ఈ క్రతువులో అంజలి రెడ్డి వెంట షర్మిల.. ఆమె భర్త అనిల్ ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొంతమంది టిడిపి నాయకులు కూడా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. జగన్ బెంగళూరులో పెళ్లి జరపడానికి ఆసక్తిని చూపించారు.. టిడిపి నాయకులు కసిగా సోషల్ మీడియాలో అంజలి రెడ్డి సర్కులేట్ చేస్తున్నారు. వైసిపి నాయకులను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.

అంజలి రెడ్డి.. రఘురాం రెడ్డిది పెద్దలు కుదిరించిన వివాహం. రఘురాం రెడ్డి కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే అమెరికాకు వెళ్ళింది. అక్కడ స్థిరపడింది. రఘురాం రెడ్డి తల్లిదండ్రులు వ్యాపారం చేస్తారు. రఘురాం రెడ్డి వైద్యుడిగా స్థిరపడ్డారు. అంజలి రెడ్డి వివాహాన్ని బెంగళూరులోనే నిర్వహించేందుకు షర్మిల అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి అన్న పంతం నెగ్గడంతో షర్మిల తట్టుకోలేక వేరే ప్రాంతంలో తన కూతురిని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత హైదరాబాద్ నగరంలో నూతన దంపతులకు రిసెప్షన్లు ఉన్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు.. రాజశేఖర్ రెడ్డి అభిమానులు హాజరవుతారని సమాచారం.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird