Home సినిమా పుష్పక విమానం వెబ్ సిరీస్ రివ్యూ – Andhra Waves

పుష్పక విమానం వెబ్ సిరీస్ రివ్యూ – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


వెబ్ సిరీస్: పుష్పక విమానం
నటీనటులు: సాయి రోనక్, మధు దామరాజు, భరణి శంకర్
ఎడిటింగ్: సజ్జత్ అలీ మొఘల్
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్
సినిమాటోగ్రఫీ: సాయితేజ కల్ల
నిర్మాతలు: శ్రీహర్ష శెట్టి, గోపిరాజు పారెళ్ల
దర్శకత్వం: సతీష్ మల్లిడి
ఓటీటీ: జియో హాట్ స్టార్

బిగ్ బాస్ తెలుగు భరణి డెబ్యూ వెబ్ సిరీస్ ఇది. సాయి రోనక్, మధు దామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ:
పుష్పక్ (సాయి రోనక్) ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. చదువులో పెద్దగా రాణించకపోయినా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. అతని లవ్ సావిత్రి (మధూ దామరాజు). గత 8 ఏళ్లుగా సావిత్రి అతనిపై కోపంతో ఉంటుంది. ఎంత బ్రతిమాలినా ఆమె కరగదు. మరోవైపు పుష్పక్ ఉంటున్న డార్విన్ కాలనీని ఖాళీ చేయించడానికి కొందరు పెద్ద తలకాయలు ప్రయత్నించవచ్చు. అప్పులు, బ్రేకప్, కాలనీ సమస్యతో పుష్ప జీవితం చిక్కుల్లో పడుతుంది.

ఇలాంటి టైంలో ఓ అజ్ఞాత వ్యక్తి (భరణి శంకర్) పుష్పక్‌కి తారసపడతాడు. కాలనీ చివర ఉన్న పాడుబడిన బిల్డింగ్‌కి వెళ్లమని, అక్కడి లిఫ్ట్ అతని జీవితాన్ని మారుస్తుందని చెబుతుంది. అనుకోకుండా ఆ లిఫ్ట్ ఎక్కిన పుష్పక్ 2026 నుంచి ఏకంగా 2016లోకి వెళ్లిపోతాడు. గతంలో తాను చేసిన ఒక చిన్న తప్పును సరిచేసుకోవాలని అనుకుంటాడు. కానీ గతంలో చేసిన ఆ చిన్న మార్పు ప్రస్తుత జీవితంపై పెద్ద ప్రభావం చూపుతుంది. అప్పటివరకు 4 మంది వెంటపడితే, ఆ మార్పు తర్వాత 40 మంది వెంటపడటం మొదలుపెడతారు. అసలు పుష్పక్ ఏం మార్చాడు? ఆ లిఫ్ట్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:
టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ లిఫ్ట్ ద్వారా టైం ట్రావెల్ అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు సతీష్ మల్లిడి మొదటి 4 ఎపిసోడ్స్‌లో కథను సింపుల్‌గా, ఫన్‌గా నడిపించాడు. సాయి రోనక్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా బాగా సెట్ అయ్యాడు. మధూ, భరణి, రఘు కుమార్ కారుమంచి తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ రావడం, 8 ఎపిసోడ్స్‌తో సీజన్ పూర్తవడం ఆసక్తిని పెంచుతుంది.

ఈ సిరీస్‌లో కొత్త కాన్సెప్ట్, లైట్ ఫాన్, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్‌లో ట్విస్ట్ బలాన్ని చేకూరుస్తాయి. కొన్ని చోట్ల స్లో నరేషన్, టైం ట్రావెల్ లాజిక్‌లో అక్కడక్కడ డౌట్స్ కాస్త తికమక పెడతాయి. అయితే టైం ట్రావెల్, ఫాంటసీ ఇష్టపడే వారికి ఇది మంచి టైంపాస్ సిరీస్. మిగిలినవారు ఒకసారి ట్రై చేయొచ్చు.

దర్శకుడు సతీష్ మల్లిడి కథను పెద్దగా కాంప్లికెట్ చేయకుండా, సింపుల్‌గా, ఫన్‌గా నడిపేందుకు ప్రయత్నించాడు. మొదటి 4 ఎపిసోడ్స్‌లో పుష్పక్ క్యారెక్టర్‌ను, అతని సమస్యలను, సావిత్రితో అతని రిలేషన్‌ను నెమ్మదిగా పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్తాడు.ఎడిటింగ్‌లో ఇంకాస్త జాగ్రత్త పడాల్సి వచ్చింది. మ్యూజిక్ ఒకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
సాయి రోనక్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా తన పాత్రకు బాగా సెట్ అయ్యాడు. అప్పులు, బ్రేకప్, కాలనీ సమస్యతో ఇబ్బంది పడే యువకుడిగా అతని నటన సహజంగా అనిపిస్తుంది. మధూ దామరాజు సావిత్రి పాత్రలో ఆకట్టుకుంది. భరణి శంకర్ అజ్ఞాత వ్యక్తిగా కథకు మిస్టరీని జోడించారు. రఘు కుమార్ కారుమంచి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా.. కేవలం ఒకే

రేటింగ్: 2/5

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird