Table of Contents
స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. డయాబెటిస్తో బాధపడుతున్న వారు కూడా స్వీట్స్ తినాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ వంటి తీపి పదార్థాలను ఇష్టపడతారు. పిల్లలు మారాం చేసినప్పుడో లేదా ఏదైనా సాధించినప్పుడు బహుమతిగానో తల్లిదండ్రులు ఏదో ఒక స్వీట్ ఇస్తారు. అయితే, పిల్లలకు ప్రతిరోజూ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వంటి ప్రముఖ వైద్య సంస్థల సూచనల ప్రకారం పిల్లల చక్కెర వినియోగంపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. రెండేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులకు అదనపు చక్కెర కలిపిన చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ అసలు ఇవ్వకూడదు. 2 నుంచి 18 ఏళ్ల వయస్సు పిల్లలు రోజుకు 25 గ్రాములు (సుమారు 6 టీస్పూన్లు) కంటే ఎక్కువ అదనపు చక్కెర తీసుకోకూడదు. ఒక చిన్న కూల్ డ్రింక్ క్యాన్ లేదా ఒక చాక్లెట్ బార్లోనే దాదాపు 24 నుంచి 27 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే ఒక్క డ్రింక్ తాగితేనే వారి రోజువారీ పరిమితి పూర్తయిపోతుంది.
చక్కెర అధికంగా తీసుకోవటం వల్ల నష్టాలు..
- ప్రతిరోజూ అధిక చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో ‘ఇన్సు రెసిస్టెన్స్’ ఏర్పడుతుంది. పెద్ద ఫలితంగావారిలో కనిపించే టైప్-2 మధుమేహం, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది.
- అధిక చక్కెర శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీనివల్ల పిల్లలు తరచూ జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.
- స్వీట్లు, ప్యాకెట్ జ్యూస్లలో ఎక్కువగా తింటే చిన్న వయసులోనే అధిక బరువు బారిన పడే అవకాశం ఉంది.
- నోటిలోని హానికరమైన చక్కెరను ఆమ్లంగా మారుస్తుంది. దీనివల్ల పిల్లల పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతిని పిప్పి పళ్లు, చిగుళ్ల నొప్పులు వస్తాయి.

