Home సినిమా బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్:ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్..థియేటర్లలో నవ్వుల జాతరే! – Andhra Waves

బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్:ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్..థియేటర్లలో నవ్వుల జాతరే! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


ఎప్పట్నుంచో అభిమానులు ఎదురుచూస్తు వస్తున్న తీపి కబురు రానే వచ్చింది. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్, ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్ అయ్యింది. దీంతో అభిమానులు, సినీ ప్రేమికులు ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే’ అని పాడుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియా సైతం ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడడంతో షేక్ అవుతోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. “మ్యాన్ ఆఫ్ మాసెస్, కింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిస్తే ఇక నవ్వుల జాతరే.. త్వరలోనే అసలైన వినోదం మొదలవుతుంది” అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ప్రకటనతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను ఇష్టపడే సాధారణ ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఇప్పటివరకు పవర్ ఫుల్ యాక్షన్, సీరియస్ మరియు ఎమోషనల్ పాత్రలతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఎన్టీఆర్, చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంలో నటించబోతున్నారు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్, మాస్ ఎనర్జీతో వెండితెరపై నవ్వులు పూయించడంలో తారక్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. గతంలో ‘అదుర్స్’, ‘బృందావనం’, ‘బాద్షా’ వంటి చిత్రాలలో ఎన్టీఆర్ చేసిన కామెడీ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు.

మరోవైపు, వరుస విజయాలతో అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, ఎన్టీఆర్‌ను ఏ విధంగా చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. 2015లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి, ఆ తర్వాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భగవంత్ కేసరి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మన శంకర వరప్రసాద్ భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రదర్శించారు. ముఖ్యంగా హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పంచ్ డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీని జోడించడంలో సిద్ధహస్తుడు.

ఇది కూడా చదవండి:సమ్మర్‌లో కలుద్దాం: ఈ సినిమాతో మనమేంటో అందరికీ తెలుస్తుంది.. హీరో సరోజ్ కుమార్!

నందమూరి కుటుంబానికి అనిల్ రావిపూడికి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్‌లోనే, ఇప్పుడు ఆయన సోదరుడు ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం విశేషం. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని సినీ విశ్లేషకులు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక, షూటింగ్ ప్రారంభ తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి మాస్ అండ్ కామెడీ కలయికలో రాబోతున్న ఈ పవర్ ప్యాక్ ఎంటర్‌టైనర్ టాలీవుడ్‌లో మరో భారీ సంచలనానికి నాంది పలకడం ఖాయంగా కనిపిస్తుంది.

అభిమానులైతే ఈ ఇయర్ కి బిగ్గెస్ట్ క్రేజీ అనౌన్స్ మెంట్ ఇదే అంటూ 2028 సంక్రాంతికి ఎన్టీఆర్, అనిల్ రావిపూడికి పోటీగా ఎవరు రాకపోవడం మంచిదంటూ మర్యాదపూర్వకంగానే గొరవంతో కూడిన కామెంట్స్ చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:రామాయణ vs ధురంధర్ 2:తట్టు కోవడం కష్టమే భయ్యా!
మీకు నచ్చవచ్చు:ఇట్లు అర్జున మూవీ రివ్యూ!

[Ntr, Anil Ravipudi, Kalyan Ram, Tollywood]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird