Home సినిమా రుకు రుకు రుక్మిణి: కృష్ణ ప్రేమ పాట భలే క్యూట్‌గా ఉంది.! – Andhra Waves

రుకు రుకు రుక్మిణి: కృష్ణ ప్రేమ పాట భలే క్యూట్‌గా ఉంది.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


నితిన్ హీరోగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ‘అలియాస్ రుక్మిణి’. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘రుకు రుక్మిణి’ ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆఫియా సయ్యద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఇప్పుడు కృష్ణ, రుక్కుల ప్రేమకథను పరిచయం చేస్తూ ఈ పాట వచ్చింది.

‘రుకు రుకు రుక్మిణి’ పాటలో ప్రధానంగా ఆకట్టుకునేది దాని పెప్పీ మ్యూజిక్. విజయ్ బుల్గానిన్ తనదైన స్టైల్‌లో క్యాచీ ట్యూన్‌తో పాటను కంపోజ్ చేశారు. వినగానే హమ్ చేసుకునేలా ఉండే పదాలు, రిథమ్‌కు తగ్గట్టుగా సాగే సంగీతం ఈ పాటకు ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తున్నాయి.

పూర్ణాచారి అందించిన లిరిక్స్‌లో కృష్ణుడు, రుక్మిణి పేర్లను ఉపయోగిస్తూ ప్రేమకథకు ఒక ప్రత్యేకమైన ఫీల్డ్ తీసుకొచ్చారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ కూడా ఈ పాటలోని ఎనర్జీకి సెట్ అయింది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా సింపుల్‌గా, సరదాగా సాగే పాటగా దీన్ని రూపొందించారు.

ఈ పాటలో నితిన్ కృష్ణగా, ఆఫియా సయ్యద్ రుక్మిణిగా కనిపిస్తున్నారు. నితిన్ లుక్ కాస్త రిఫ్రెషింగ్‌గా ఉండగా.. ఆఫియా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఆఫియా ఈ సినిమాలో టీచర్ పాత్రలో కనిపించనుందని ఆమె గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నితిన్ మాత్రం రచయిత కృష్ణగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో పాటలోని కృష్ణ, రుక్కుల ప్రేమకథ సినిమా కథకు ఎలా కనెక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

నితిన్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఉన్నారు. మరోవైపు, నాని బ్యానర్‌లో రూపొందించిన ‘అలియాస్ రుక్మిణి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించింది. డిసెంబర్ 4, 2026న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇది కూడా చదవండి: ఉన్నంతలో మనకున్నంతలో.. ‘భజగోవిందం’ పాట వెనుక ఉన్న గొప్ప అర్థం తెలుసా.?

[Alias Rukmini First Single, Ruku Ruku Rukmini Song, Alias Rukmini Movie, Nithiin, Aafiya Syed, Vijay Bulganin, Anurag Kulkarni, Natural Star Nani, Telugu Film News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird