Home సినిమా పెరిగిన రూపాయి విలువ – iDreamPost – Andhra Waves

పెరిగిన రూపాయి విలువ – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
పెరిగిన రూపాయి విలువ - iDreamPost


భారత రూపాయి విలువ పెరిగింది. శుక్రవారం ఫారెన్ ఎక్సేంజ్ మార్కెట్‌లో భారత రూపాయి లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా కరెన్సీ బలహీనపడటం, యూఎస్ ట్రెజరీ బాండ్ల దిగుబడి తగ్గడం ఇండియన్ రూపీకి కలిసొచ్చింది. గురువారం నాటి సెషన్‌లో 95.26 వద్ద ముగిసింది.. శుక్రవారం ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో 95.21 వద్ద ముగిసింది. ఆ తర్వాత మరింత బలపడి 7 పైసల లాభంతో 95.19 స్థాయికి చేరుకుంది.

అయితే, అంతకు మించి రూపాయి ధర పెరగలేకపోయింది. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎక్కువగా ఉండటం, ఆసియా మార్కెట్ల బలహీనత కారణంగా రూపాయి మరింత పుంజుకోకుండా అడ్డుకట్ట పడింది. ప్రధాన ఆరు దేశాల కరెన్సీలతో పోల్చి చూస్తే యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.27 శాతం క్షీణించి 101.75 స్థాయికి పడిపోయింది. యూఎస్ బాండ్ల దిగుబడి తగ్గడం రూపాయికి కలిసివచ్చిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

అయితే, చమురు ధరల పెరుగుదల, బలహీనమైన ఆసియా ఈక్విటీల కారణంగా ఈ లాభాలు కొంత వరకు పరిమితమయ్యాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఐరోపా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ తమ వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగుతుంది. ఇక, రూపాయి లాభాలతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా ఉదయం ట్రేడింగ్‌లో సానుకూలంగా ముందుకు సాగాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 138.77 పాయింట్లు లాభపడి 74,289.81 వద్ద.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 38.95 పాయింట్ల లాభంతో 22,967.10 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. కాగా, గురువారం నాటి సెషన్‌లో ఫారెన్ ఇన్వెస్టర్లు 943.60 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించారు.

రచయిత అవతార్

వెంకటేశ్వర్లు

నా పేరు వెంకటేశ్వర్లు. iDreamPost.comలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ సినిమా, జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. 2016లో జర్నలిజం వైపు వచ్చాను. జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి వెబ్ డెస్క్ నుంచి వృత్తిపర జర్నీ మొదలైంది. ఆ తర్వాత సుమన్ టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో సేవలను అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird