2
- మొదటిది ‘క్లారిటీ’ (స్పష్టత): మీరు ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు? దాని సిలబస్ ఏంటి అంటే దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకేసారి అనేక పరీక్షల వైపు దృష్టి పెట్టకుండా, ఒక లక్ష్యంపై 2-3 సంవత్సరాలు ఫోకస్ చేయాలి.
- రెండవది ‘కమిట్మెంట్’ (నిబద్ధత): లక్ష్యం నెరవేరే వరకు ఎలాంటి డిస్ట్రక్షన్స్ లేకుండా అంకితభావంతో తపస్సులా చదవాలి.
- మూడవది ‘కాన్సిస్టెన్సీ’ (Consistency): కొన్ని రోజులు చదివి ఆపేయకుండా, ప్రతిరోజూ తప్పకుండా చదివే అలవాటు ఉండాలి.
- నాలుగవది ‘కాన్ఫిడెన్స్’ (కాన్ఫిడెన్స్): తాత్కాలిక మోటివేషన్ కంటే మీపై మీకున్న ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని గెలుపు తీరాలకు చేరుస్తుంది.
- ఐదవది ‘కంటిన్యూటీ’ (కొనసాగింపు): ఉద్యోగం వచ్చే వరకు వెనకడుగు వేయకుండా నిరంతరం శ్రమించాలి.
- వీటితో పాటు కేవలం బట్టీ పట్టకుండా కాన్సెప్ట్‌లను లోతుగా అర్థం చేసుకోవడం, సొంతంగా షార్ట్ నోట్స్ రాసుకోవడం, & గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను (PYQs) పరిశీలించడం చాలా ముఖ్యం.
- పరీక్షకు ముందు వచ్చే చివరి 45 రోజులు మరింత కీలకం. సరిగ్గా రియల్ ఎగ్జామ్ టైమింగ్స్‌లో మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష భయం పోయి, విజయం మీసొంతం అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్
పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి:

