Home ఆంధ్రప్రదేశ్ అసదుద్దీన్ ఒవైసీ: ఒవైసీ దెబ్బకు.. జగన్ కు బిపి పెరుగుతోంది – Andhra Waves

అసదుద్దీన్ ఒవైసీ: ఒవైసీ దెబ్బకు.. జగన్ కు బిపి పెరుగుతోంది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


అసదుద్దీన్ ఒవైసీ: ఏపీ రాజకీయాలలో సరికొత్త పరిణామం మొదలైంది. ఒకవైపు కూటమిని ఎదుర్కొంటూ.. పురపాలక ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని వైసిపి అధినేత జగన్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఎంఐఎం శిరోభారాన్ని కలిగిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మైనార్టీ ఓట్లే మీకు తిరుగులేని బలమని జగన్ నమ్ముతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ వర్గం ఓట్లను చీల్చడానికి ఓవైసీ పక్క వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. ఇది కాస్త రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.. […]

అసదుద్దీన్ ఒవైసీ: ఏపీ రాజకీయాలలో సరికొత్త పరిణామం మొదలైంది. ఒకవైపు కూటమిని ఎదుర్కొంటూ.. పురపాలక ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని వైసిపి అధినేత జగన్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఎంఐఎం శిరోభారాన్ని కలిగిస్తోంది.

ఎన్నో సంవత్సరాలుగా మైనార్టీ ఓట్లే మీకు తిరుగులేని బలమని జగన్ నమ్ముతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ వర్గం ఓట్లను చీల్చడానికి ఓవైసీ పక్క వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. సాధారణంగా ఏపీ రాజకీయాలలో ఎంఐఎం పాత్ర నామమాత్రమని అంతా అనుకుంటారు.. కానీ ఈసారి వ్యూహాత్మకంగా ఓవైసీ అడుగులు వేశారు. అన్ని సీట్లలో కాకుండా.. పట్టు ఉన్నచోట.. గెలిచే అవకాశం ఉన్నచోట.. కచ్చితంగా పోటీ చేయాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ కోరికనే వయసుకు కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న కడప కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఓవైసీ కన్ను వేశారు. కడప మేయర్ పదవితో పాటు.. విజయవాడకు కీలకమైన డివిజన్లు.. హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానం ఏకంగా 21 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయడం విశేషం. ఇది కాస్త క్యాంపులో ఆందోళన కలగజేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవడానికి స్వయంగా ఎంఐఎం నేతలు హైదరాబాద్ నుంచి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మిరాజ్.. మహమ్మద్ ముబీన్.. మజీద్ హుస్సేన్.. ఎమ్మెల్సీ రియాజ్ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎంఐఎం అనేది ఒక ప్రాంతీయ పార్టీ.. కాకపోతే ఉత్తర ప్రదేశ్ నుంచి పెడితే బీహార్ వరకు ఇది పోటీ చేస్తోంది. ఈసారి తెలంగాణకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా స్థానిక ఎన్నికల్లో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి రక్తపోటుని పెంచుతుంది.

ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ.. క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న జగన్ అసెంబ్లీకి ఈ పరిణామం ఒక రకంగా ఇబ్బందిగా మారింది. తన వెంటే మైనారిటీలు ఎప్పుడూ ఉంటారని జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తారు. అయితే ఎంఐఎం పార్టీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పాగా వేయాలని చూస్తోంది. ఇది కాస్త జగన్ కు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా కడప గడ్డమీద మేయర్ బరిలో నిలవడం.. ముస్లిం ఓట్లలో చీలిక వస్తే అది ప్రత్యర్థులకు ప్లస్ అవుతోందని ఆందోళన జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మొత్తానికి ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం ప్రవేశం కేవలం కొన్ని స్థానాలకే పరిమితం కాకుండా.. వచ్చే రోజుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ పై గట్టి ప్రభావం చూపించేలా..



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird