Home Latest News విజయవాడ మేయర్ అభ్యర్థులు వంగవీటి, ఏబీవీ: ప్రత్యర్థులే అయినా విలువలకే పెద్దపీట.! | వంగవీటి రాధా ఎబి వెంకటేశ్వరరావు ప్రాధాన్యత విలువలు | విజయవాడ రాజకీయం | ఎన్నికల ప్రచారం | జనసేన | స్వతంత్ర | మేయర్ | అభ్యర్థులు – Andhra Waves

విజయవాడ మేయర్ అభ్యర్థులు వంగవీటి, ఏబీవీ: ప్రత్యర్థులే అయినా విలువలకే పెద్దపీట.! | వంగవీటి రాధా ఎబి వెంకటేశ్వరరావు ప్రాధాన్యత విలువలు | విజయవాడ రాజకీయం | ఎన్నికల ప్రచారం | జనసేన | స్వతంత్ర | మేయర్ | అభ్యర్థులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


రాజకీయ రంగంలో ప్రత్యర్థులుగా తలపడే నాయకులు వ్యక్తిగత స్థాయిలో గౌరవంగా మెసులుకుంటే ఎంత హుందాగా ఉంటుందో ఏబీవీ, వంగవీటి రాధాలు చూపించారు. విజయవాడ మేయర్ అభ్యర్థులుగా పరస్పరం తలపడుతున్న వంగవీటి రాథా, ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచార హోరులో భాగంగా ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా ఇరువురూ ఆప్యాయంగా హత్తుకుని పలకరించుకోవడం ఆరోగ్యకరమైన రాజకీయాలకు ప్రతీకగా నిలిచిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

విజయవాడ పరిధిలోని గుణదల ప్రాంతంలో ఎన్నికల ప్రచారం సమయంలో జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు ఎదురుపడ్డారు. ఎన్నికల్లోప్రత్యర్థులుగా పోటీ పడుతున్నప్పటికీ, ఆ ఇద్దరు నేతలు ఎలాంటి సంకోచం లేకుండా చిరునవ్వుతో పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకుని పరస్పరం బెస్టాఫ్ లక్ చెప్పారు.

ఇరువురు నేతల ఈ స్నేహపూర్వక పలకరింపు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలనే కాకుండా ఏబీవీకి మద్దతు ఇస్తున్న పార్టీల క్యాడర్ ను కూడా విస్మయపరిచింది. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం, విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం హీటెక్కి కద్దు. అయితే అందుకు భిన్నంగా, వంగవీటి రాధా ఏబీవీలు స్నేహపూర్వక పలకరింపు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.

వీరిరువురూ పరస్పరం పలకరించుకుని హత్తుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిరువురూ నేటిజనుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. రాజకీయ పోరును వ్యక్తిగత శత్రుత్వంగా మార్చుకోకుండా ఇలా స్నేహపూర్వకంగా మెలగడం ఆరోగ్యకరమైన రాజకీయాలకు ప్రతీకగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


[Vangaveeti Radha AB Venkateswara Rao Priority Values,  Vijayawada Politics, Election Campaigning, Janasena, Indopendent, Mayor, Candidates, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird