లక్ష్మీదేవి పేట: 112వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల వైష్ణవి ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ టీమ్ సభ్యులు పాల్గొనడంతో లక్ష్మీదేవి పేటలో సందడి నెలకొంది. టీమ్ సభ్యులను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపించారు. వారితో కరచాలనం చేస్తూ, ఆప్యాయంగా ముచ్చటిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రచార కార్యక్రమంలో జబర్దస్త్ టీమ్ సభ్యులు ప్రజలతో మమేకమై మాట్లాడటంతో అక్కడ ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. కూటమి అభ్యర్థి ఆళ్ల వైష్ణవికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక ప్రజల సందడి, కూటమి కార్యకర్తల ఉత్సాహం మధ్య ఎన్నికల ప్రచారం కొనసాగింది.

