Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు: బీసీలకు రాజ్యాధికారం.. కుట్రలను ఓడించండి – Andhra Waves

చంద్రబాబు నాయుడు: బీసీలకు రాజ్యాధికారం.. కుట్రలను ఓడించండి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


చంద్రబాబు నాయుడు: ఏపీ రాజకీయాలలో కీలక ఘట్టం. పెద్ద సమాజంలో ఉన్న బీసీలకు కీలక స్థానం లభించబోతోంది. ఒకరకంగా చెప్పాలంటే అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. జగన్ కుట్రలను తిప్పికొట్టింది. చరిత్రాత్మక నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధమైంది. వారికి మరింత సుస్థిరతను ఇచ్చేందుకు ప్రభుత్వం సమగ్ర అధ్యయనం కోసం వన్ మ్యాన్ డెడికేషన్ కమీషన్‌ను నియమించింది. […]

చంద్రబాబు నాయుడు: ఏపీ రాజకీయాలలో కీలక ఘట్టం. పెద్ద సమాజంలో ఉన్న బీసీలకు కీలక స్థానం లభించబోతోంది. ఒకరకంగా చెప్పాలంటే అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. జగన్ కుట్రలను తిప్పికొట్టింది. చరిత్రాత్మక నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధమైంది. వారికి మరింత సుస్థిరతను ఇచ్చేందుకు ప్రభుత్వం సమగ్ర అధ్యయనం కోసం వన్ మ్యాన్ డెడికేషన్ కమీషన్‌ను నియమించింది.

వన్ మ్యాన్ డెడికేషన్ కమిషన్ నివేదిక మంత్రివర్గ సమావేశం ముందుకు వచ్చింది. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. నుండి లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు సింహభాగం సీట్లు వస్తాయి. సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు రాకపోయినప్పటికీ పార్టీపరంగా 34% వాటా బీసీలకు కేటాయిస్తున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వన్ మ్యాన్ కమీషన్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. సమగ్ర సామాజిక.. ఆర్థిక… రాజకీయ సమాచారం ఆధారంగా ఈ నివేదికను వన్ మ్యాన్ కమీషన్ పక్కాగా రూపొందించింది. గతంలో రిజర్వేషన్ల కేటాయింపులో అనేక రకాలుగా న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ నిబంధనలను తయారు చేశారు. న్యాయం జరిగే విధంగా చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు.

కొన్ని రోజులుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో వైసిపి విపరీతమైన కుట్రలు చేసింది. తప్పుడు ప్రచారాలు చేసింది. సొంత మీడియాలో అడ్డగోలుగా కూతలు కూసింది. చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. వైసిపి విష ప్రచారం చేసింది. చివరికి సుప్రీంకోర్టులో అనుకూలమైన ఫలితాలు రాకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీపరంగా వెనుకబడిన కులాల వారికి తోడ్పాటు ప్రకటించారు. వైసీపీ నేతలు కోర్టులలో వేసిన పిటిషన్లు.. అనవసరమైన వివాదాలను చంద్రబాబు తన చతురతతో తొక్కి వేశారు. బీసీలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా 34 శాతం కోటాను పార్టీ పరంగా ప్రకటించడంతో బడుగు బలహీన వర్గాల్లో ఆనందం తాండవిస్తోంది.

గత ప్రభుత్వం బీసీలకు అడుగడుగునా అన్యాయం చేసింది. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగుల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. బీసీలలో ఉన్న అన్ని కులాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం మొదలుపెట్టారు. వెనుకబడిన కులాలకు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నారు. వారి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రాజ్యాధికారాన్ని కూడా ప్రాప్తించేలా చేస్తున్నారు. బీసీలకు ఆరాధ్య నాయకుడిగా.. చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird