ఆంధ్ర ప్రదేశ్: శీర్షిక చదివారు కదా.. ఇదేంటి ఇంతలా ట్విస్ట్ ఇచ్చారు.. అసలు ఏం జరిగింది.. ఏమై ఉంటుంది అనే సందేహాలు మీలో ఉన్నాయ్ కదా.. మీ సందేహాలకు సమాధానమే ఈ కథనం.. ఇంతకీ మన ఆంధ్ర పట్టణాలు ఏం చేశాయి.. వాటిలో ఏం జరిగింది.. ముఖ్యంగా గడిచిన రెండు సంవత్సరాలలో ఏం జరిగింది.. దీని గురించి తెలుసుకుందాం పదండి. […]
ఆంధ్రప్రదేశ్: శీర్షిక చదివారు కదా.. ఇదేంటి ఇంతలా ట్విస్ట్ ఇచ్చారు.. అసలు ఏం జరిగింది.. ఏమై ఉంటుంది అనే సందేహాలు మీలో ఉన్నాయ్ కదా.. మీ సందేహాలకు సమాధానమే ఈ కథనం.. ఇంతకీ మన ఆంధ్ర పట్టణాలు ఏం చేశాయి.. వాటిలో ఏం జరిగింది.. ముఖ్యంగా గడిచిన రెండు సంవత్సరాల్లో ఏం జరిగింది.. దీని గురించి తెలుసుకుందాం.
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ పరిశుభ్రత సర్వేలు వెల్లడిస్తుంటుంది. దేశంలో తను శుభ్రంగా పెంపొందించడం.. స్వచ్ఛతను కాపాడటం దీని వెనుక ఉన్న ఉద్దేశం. పరిశుభ్రమైన నగరాల జాబితాను ప్రకటించి.. వాటికి ప్రోత్సాహకాలను కేంద్రం అందిస్తూ ఉంటుంది. ఈసారి కేంద్రం ప్రకటించిన జాతీయ ర్యాంకింగ్ ల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని మూడు పట్టణాలు కీలక స్థానాల్లో నిలిచాయి. ఏపీలో మూడు పట్టణాల గురించి జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. అమలు చేస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సర్వే ఫలితాల ప్రకారం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మహారాష్ట్రలోని నవి ముంబైగా నిలిచింది. రెండో స్థానంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం. ఇక మూడో ఆంధ్రప్రదేశ్ స్థానంలో విజయవాడ నిలిచింది.
దక్షిణాది ప్రాంతాలలో విజయవాడ కంటే ఎన్నో పెద్ద నగరాలు ఉన్నాయి. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు.. తిరువనంతపురం వంటి నగరాలు.. వాటన్నిటిని దాటి విజయవాడ దేశంలోనే మూడవ స్వచ్ఛ నగరంగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పరిశుభ్రత మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. తడి చెత్త.. పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తుంది. గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించిన కేంద్రాలను మరోసారి పునరుద్ధరించింది. చెత్త సేకరణ వాహనాలను పెంచింది. రోడ్లమీద చెత్త వేయకుండా ఎక్కడికక్కడ కుండీలను ఏర్పాటు చేసింది. విజయవాడ నగరం స్వచ్ఛతను సంతరించుకుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం విజయవాడ నగరం మీద మరిత ఫోకస్ చేయడంతో నగరం శుభ్రంగా ఉంది. అందుకే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విజయవాడ మూడో స్థానంలో నిలిచింది.
ఇక జనాభా పరంగా చూసుకుంటే గ్రేటర్ విశాఖపట్నం మొదటి స్థానంలో గెలిచింది. 10 లక్షలు అంతకుమించిన జనాభా ఉన్న నగరాల జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంది. విశాఖపట్నం తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ రెండవ స్థానం.. ఉత్తరప్రదేశ్లోని లక్నో మూడో స్థానంలో ఉంది. జీవనానికి అనుకూలమైన పరిస్థితులు.. ఉపాధి అవకాశాలు… ప్రభుత్వ అనుకూల నిర్ణయాల వల్ల విశాఖపట్నంలో జనాభా వృద్ధి చెందుతోంది. స్థానికులే కాకుండా.. ఇక్కడ అనేక రకాల ప్రాంతాలకు చెందినవారు జీవిస్తున్నారు. రకరకాల పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఐటి.. ఫార్మా.. లాజిస్టిక్స్.. వంటి రంగాలలో విశాఖపట్నం వృద్ధిని సాగిస్తోంది. ప్రభుత్వం ఐటీ పరంగా విశాఖపట్నం నగరానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో.. వృద్ధి వేగంగా సాగుతోంది. ఇతర ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి నివసించడానికి ప్రధాన కారణం కూడా అదే. అందువల్లే విశాఖపట్నం దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరంగా ఆవిర్భవించింది.
మూడు నుంచి పది లక్షల జనాభా ఉన్న నగరాలలో గుంటూరు మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మొదటి స్థానంలో ఉంది. పంజాబ్లోని చండీగఢ్ రెండవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మూడో స్థానంలో ఉంది.. గుంటూరు నగరంలో ఈ స్థాయిలో జనాభా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉపాధి అవకాశాలు. స్థానికంగా అనుకూలంగా ఉన్న వనరులు.. ప్రభుత్వ విధానాలు కూడా అనుకూలంగా ఉండటంతో ఇక్కడికి చాలామంది వచ్చి ఉపాధి పొందుతున్నారు.
గతంలో కేంద్రం విడుదల చేసే జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి అంతగా ప్రాధాన్యత లభించేది కాదు. కానీ ఈసారి.. విశాఖపట్నం.. గుంటూరు వంటి ప్రాంతాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మూడు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతోంది. వాటి ఫలితాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందువల్లే ఈ మూడు నగరాలు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయి. ఈ మూడు నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి.. సామాజిక అభివృద్ధి.. పట్టుకొమ్మలు.
