Home సినిమా వాట్సాప్‌లో కొత్త షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ – Andhra Waves

వాట్సాప్‌లో కొత్త షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
వాట్సాప్‌లో కొత్త షెడ్యూల్ మెసేజ్ ఫీచర్


వాట్సాప్ యూజర్లు ఎప్పటి నుంచో ఉన్న ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఇకపై ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలన్నా, ముఖ్యమైన సరైన టైంకు పంపాలన్నా రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఉండాల్సిన అవసరం లేదు. ముందుగానే మెసేజ్ టైప్ చేసి ఏ తేదీన, ఏ సమయంలో వెళ్లాలో సెట్ చేస్తే చాలు. నిర్ణయించిన సమయానికి వాట్సాప్ ఆటోమెటిక్‌గా మెసేజ్ పంపుతుంది. ముఖ్యంగా ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా, వాట్సాప్ ఓపెన్ చేయకపోయినా మెసేజ్ డెలివరీ అవుతుంది. ఈ ఫీచర్ వ్యక్తిగత చాట్స్‌తో పాటు గ్రూప్ చాట్స్‌లోనూ పనిచేస్తుంది.

వాట్సాప్‌లోకి కొత్త షెడ్యూల్ మెసేజ్ ఫీచర్

మెటాకు చెందిన వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం దశలవారీగా అందిస్తోంది. ఇప్పటికే కొంతమంది బీటా యూజర్లకు పరీక్షల రూపంలో అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 25న వాట్సాప్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా కూడా ఈ ఫీచర్‌పై సంకేతాలు ఇచ్చింది. దీని యూజర్లు ఇతర థర్డ్ యాప్ పార్టీలపై ఆధారపడకుండా వాట్సాప్‌లోనే మెసేజ్‌లను ముందుగా షెడ్యూల్ చేసుకోవచ్చు. కనీసం 10 నిమిషాల నుండి గరిష్ఠంగా రెండు వారాల వరకు మెసేజ్ పంపే సమయాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ ఒకేసారి అందుబాటులో లేదు. మీ ఫోన్‌లో ఇంకా కనిపించకపోతే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.

మెసేజ్ షెడ్యూల్ చేయడం ఎలా?

ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నవారు చాలా సులభంగా మెసేజ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ముందుగా వాట్సాప్‌లో ఎవరికైతే మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత పంపాలనుకున్న మెసేజ్ టైప్ చేయాలి. ఫోటో లేదా వీడియో పంపాలనుకుంటే వాటిని కూడా జత చేయవచ్చు. ఇప్పుడు వెంటనే పంపే బటన్‌ను ఉంచాలి. అప్పుడు తేదీ, సమయం ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని ఎన్నుకుని కన్ఫర్మ్ చేస్తే మెసేజ్ షెడ్యూల్ అవుతుంది. నిర్ణయించిన సమయానికి అది ఆటోమేటిక్‌గా అవతలి వ్యక్తికి చేరుతుంది.

టెక్స్ట్‌తో పాటు ఫొటోలు, వీడియోలు కూడా పంపొచ్చు

ఈ కొత్త ఫీచర్‌లో కేవలం టెక్స్ట్ మెసేజ్‌లే కాకుండా లింకులు, ఫొటోలు, వీడియోలను కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే డాక్యుమెంట్లను షెడ్యూల్ చేసే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో లేదని సమాచారం. షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు కూడా వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణలోనే ఉంటాయి. అంటే మెసేజ్ పంపే వ్యక్తి, అందుకునే వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు. నిర్ణయించిన సమయానికి ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా మెసేజ్ డెలివరీ అవుతుంది. అందుకే పుట్టినరోజు శుభాకాంక్షలు, పండుగ సందేశాలు, ముఖ్యమైన రిమైండర్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలనుకునేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చా?

మెసేజ్ షెడ్యూల్ చేసిన తర్వాత ఏదైనా మార్పు చేయాలనుకుంటే దాన్ని డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చాట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లో షెడ్యూల్ చేసిన మెసేజ్‌ల కోసం ప్రత్యేక విభాగం కనిపిస్తుంది. అక్కడ పంపాల్సిన మెసేజ్‌ల జాబితాను చూసుకోవచ్చు. డెలివరీ కాకముందే వాటిని తొలగించవచ్చు. అలా డిలీట్ చేస్తే అవతలి వ్యక్తికి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు. గ్రూప్ చాట్స్ విషయంలో మాత్రం ఒక ముఖ్యమైన విషయం ఉంది. మెసేజ్ షెడ్యూల్ చేసిన సమయంలో గ్రూప్‌లో ఉన్న సభ్యులకే అది డెలివరీ అవుతుంది. ఆ తర్వాత కొత్తగా గ్రూప్‌లో చేరిన వారికి ముందుగా షెడ్యూల్ చేసిన మెసేజ్ అందుతుంది. మొత్తానికి ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తే వాట్సాప్ వినియోగం మరింత సులభం.

మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird