
జాతీయ యువజన కాంగ్రెస్ నేతల సోషల్ మీడియా ఖాతా నిలిపివేతకు నిరసనగా హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు దిగారు. గచ్చిబౌలిలోని మెటా ఆఫీసు వద్ద పెద్ద సంఖ్యలో చేరిన యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు. సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌తో పాటు ఇన్‌ఛార్జి మనీష్ శర్మల సోషల్ మీడియా ఖాతాలను మెటా సస్పెండ్ చేసింది. దీనిపై యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా అధికార బీజేపీకి మెటా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
నిలిపివేసిన సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే పునరుద్ధరించే వరకూ తమ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. ఆధునిక రాజకీయ కమ్యూనికేషన్‌లో సోషల్ మీడియా వేదికగా మారిన తరుణంలో ఖాతాలను నిలిపివేయడం తగదన్నారు.

ఇలా ఉండగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నిబంధనలు, కంటెంట్ విధానాలు అమలులో ఉన్న పరిస్థితులపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఖాతాల విషయంలో ఇలా నిలిపివేతలు, సస్పెన్షన్ల విషయంలో వివాదాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: మెటా లాసూట్.. టెక్ చరిత్రలోనే అతి పెద్ద కేంద్ర విచారణ.!
యూత్ కాంగ్రెస్ ఆరోపణలు, ఆందోళనలపై మెటా స్పందించాల్సి ఉంది. ఖాతాల సస్పెన్షన్ పై మెడీ నుంచి ఎటువంటి వివరణ వస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

తాజాగా యూత్ కాంగ్రెస్ జాతీయ నేతల ఖాతాల సస్పెన్షన్ తో సోషల్ మీడియా వేదికల వినియోగం, ఖాతాల నిర్వహణకు సంబంధించి మరోసారి విస్తృత చర్చకు తెరలేపింది.
మీకు నచ్చవచ్చు: ఇండియాను క్షమాపణలు కోరిన మెటా.. ఎందుకంటే?
డీప్‌ఫేక్ కట్టడిపై గుజరాత్ హైకోర్టు సీరియస్ … మెటా, ఎక్స్‌లకు నోటీసులు
[Youth Congress protest, Meta office Gachibowli,Suspension social media accounts, Youthcongressleaders, TeluguOne]
