Home సినిమా గ్రేటెస్ట్ జర్నీ.. థాంక్యూ తలా! – Andhra Waves

గ్రేటెస్ట్ జర్నీ.. థాంక్యూ తలా! – Andhra Waves

by andhra andhrawave
0 comments
గ్రేటెస్ట్ జర్నీ.. థాంక్యూ తలా!


చెన్నై సూపర్ కింగ్స్ అంటే మహేంద్ర సింగ్ ధోనీ.. మహేంద్ర సింగ్ ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్. 5 కాదు 10 కాదు ఏకంగా 19 సీజన్ ల పాటు ఒకే టీంకు ఆడడం అంటే సాధారణ విషయం కాదు. గాయాలు ఇబ్బందిపెట్టినా.. ఫిక్సింగ్ కారణంగా రెండేళ్లు చెన్నై సూపర్ కింగ్స్ ను నిషేధించినా.. జట్టు కిందకి పడిపోయినా.. ఏ రోజు కూడా CSKను వదిలే ఆలోచన కూడా చేయలేదు. ఇంత విధేయత చూపించాడు కాబట్టే ఫ్రాంచైజీ కూడా ధోనీపై బంగారంలా చూసుకుంది. ఫ్యాన్స్ కూడా ధోనీని దేవుడిలా ఆరాధించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కు ధోనీకి ఉన్న బ్యాండ్ ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోయింది. అయితే ఎంత గొప్ప బ్యాండ్ అయినా బ్రేక్ రావడం తప్పనిసరి. ధోనీకి కూడా సమయం వచ్చింది. తన పని అయిపోయిందని.. తాను జట్టులో ఉండటం ఇక అనవసరమని భావించి ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ వార్తను ఫ్యాన్స్ జీర్ణించుకోవడం కొంచెం కష్టమే అయినా ధోనీ నిర్ణయాన్ని గౌరవించి తీరాల్సిందే.

ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోనీ ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. 2008లో ప్రారంభమైన మహీ ఐపీఎల్ ప్రస్థానం నవంబర్ 17, 2026తో ముగిసింది. ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు టీమ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఆటగాడిగా ఎన్నో రికార్డులు, ఐదు ఐపీఎల్ టైటిళ్లు, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ధోనీ.. ఇప్పుడు కొత్త బాధ్యతల్లో కనిపించనున్నాడు. 19 సీజన్ల పాటు CSK జట్టు తరపున ఆడుతూ ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది టాప్ టీంగా నిలబెట్టాడు. 5 ట్రోఫీలు అందించి వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. చెన్నై ఫ్రాంచైజీకి ధోనీకి మధ్య ఉన్న బంధం విడదీయలేనిది. కానీ మహీ టైం దగ్గర పడింది. అందుకే గుడ్ బై చెప్పి గౌరవంగా తప్పుకున్నాడు.

ధోనీ రిటైర్మెంట్ కు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఫిట్ నెస్. ధోనీకి రెండు మూడు సీజన్ల పాటు ఫిట్ సమస్యలు ఉన్నాయి. గత రెండేళ్లుగా ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్నా ఫ్యాన్స్ కోసమే మహేంద్రుడు మ్యాచ్‌లు ఆడినట్టు కనిపిస్తున్నాయి. అయితే రెండు సీజన్లుగా ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. టీం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆడిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మోకాలి గాయం తిరగబెట్టడంతో ఇక జట్టులో కొనసాగడం కష్టమైపోయింది. ఇక రెండో విషయం ఏజ్. 45 ఏళ్ళ వయసులో క్రికెట్ ఆడడం అంటే చాలా కష్టం. ఫ్యాన్స్ బలవంతం చేయడం, ఫ్రాంచైజీతో ఉన్న కమిట్ మెంట్ ల కారణంగానే ధోనీగా ఉన్నా ఐపీఎల్ ఆడినట్టు కనిపిస్తున్నాయి.

2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలంలో 6 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని కొనుగోలు చేసింది. తొలి సీజన్‌లోనే తన కెప్టెన్సీతో సీఎస్‌కేను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత 2010లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి చెన్నైకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఇదే ఊపులో 2011లోనూ జట్టును విజేతగా నిలిపి వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న చెన్నైకి సడన్ గా బిగ్ షాక్ తగిలింది. 2016, 2017 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం విధించడంతో ధోనీ రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ కంపెనీ ఆడాడు. 2017లో ఆ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. రెండేళ్ల విరామం తర్వాత 2018 సీఎస్కే తిరిగి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. ఆ సీజన్‌లోనే ధోనీ మరోసారి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.

2018 తర్వాత 2021, 2023 సీజన్లలో ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే టైటిళ్లు గెలుచుకుంది. ఈ విధంగా ఇండియన్స్‌తో కలిసి అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టుగా చెన్నై విజయం సాధించింది. 2022లో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు ఫెయిలయ్యాడు. దీంతో సీజన్ మధ్యలో ధోనీ తిరిగి పగ్గాలు చేపట్టాడు. 2025లో చివరిసారిగా ఐపీఎల్‌లో ఆడిన ధోనీ, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వచ్చే సీజన్‌లో మళ్లీ ఆడతాడా లేదా అనే ప్రశ్నకు చెక్ పెడుతూ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో ప్లేయర్ గా ధోనీ ఐపీఎల్ ప్రయాణం ముగిసింది.

The post గ్రేటెస్ట్ జర్నీ.. థాంక్యూ తలా! iDreamPostలో మొదట కనిపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird