ఆన్లైన్ గేమ్స్‌లో పరిచయాలు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు దారితీస్తుంటాయి. కానీ అమెరికాలో జరిగిన ఓ ఘటనలో మాత్రం ఆన్లైన్ గేమ్‌లో పరిచయం ఏర్పడిన కిడ్నాప్‌కు గురైన బాలికను కాపాడింది. ఏడాదికి పైగా ఓ వ్యక్తి చెరలో ఉన్న బాలికను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంలో 16 ఏళ్ల బాలుడు, అతడి తల్లి కీలక పాత్ర పోషించారు. చివరకు ఎఫ్‌బీఐ సహకారంతో బాలికకు విముక్తి లభించింది.
ఆన్లైన్ గేమ్స్‌లో పరిచయమైన వ్యక్తులు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటారు. అయితే అమెరికాలో జరిగిన ఓ ఘటనలో మాత్రం ఆన్లైన్ గేమ్ ద్వారా ఏర్పడిన పరిచయం ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. ఏడాదికి పైగా కిడ్నాప్‌కు గురై ఓ వ్యక్తి ఇంట్లో బందీగా ఉన్న బాలికను 16 ఏళ్ల బాలుడు, అతడి తల్లి చాకచక్యంగా వ్యవహరించి రక్షించడంలో కీలక పాత్ర పోషించారు.
అమెరికాలోని ఉటాకు చెందిన 15 ఏళ్ల బాలిక 2025 మే నెలలో అదృశ్యమైంది. ఆమెకు ‘అమొంగ్ అస్’ అనే ఆన్లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో కొలరాడోకు చెందిన 16 ఏళ్ల లాండన్ ట్రెస్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య డిస్కార్డ్ యాప్‌లో సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి.ఈ విధంగా తాను ఒక వ్యక్తి వద్ద బండిగా ఉన్నాననీ, అతడి చెర నుంచి బయటపడేందుకు ప్రయత్నించానని బాలిక లాండన్‌కు చెప్పింది. తన అదృశ్యానికి సంబంధించిన వివరాలు, మిస్సింగ్ కేసు లింకులను కూడా అతడికి పంపించింది.
బాలిక పరిస్థితిని తెలుసుకున్న లాండన్.. అక్టోబర్ 31న తన తల్లి క్రిస్టినా ట్రెస్కు విషయం వివరించింది. వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తున్న 41 ఏళ్ల క్రిస్టినా వెంటనే స్పందించారు. బాలికతో మాట్లాడి ఆమె ఒరెగాన్లోని ఓ ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొన్నారు.పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ప్రాపర్టీ రికార్డులు, రియల్ ఎస్టేట్ ఫొటోల ఆధారంగా ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. అనంతరం బాలిక తల్లితో పాటు ఎఫ్‌బీఐ అధికారులను సంప్రదించారు.
ఎఫ్‌బీఐ పర్యవేక్షణలో జరిగిన ఫోన్ కాల్లో బాలిక తనకు ఎదురైన పరిస్థితులను వివరించింది. ఆన్లైన్లో పరిచయమైన 39 ఏళ్ల ఆడమ్ హంటర్ హార్మెల్ అనే వ్యక్తి డబ్బు ఆశ చూపి తనను ఉటా నుంచి ఒరెగాన్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం తన ఫోన్‌ను తీసివేసి ఇంట్లో నిర్బంధించినట్లు వివరించింది.నవంబర్ 1న నిందితుడు ఇంట్లో లేని సమయంలో క్రిస్టినా ఫోన్ ద్వారా బాలికకు మార్గనిర్దేశం చేశారు. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు రాగలిగింది. అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు బాలికను సురక్షితంగా రక్షించారు. అనంతరం నిందితుడిని ట్రాఫిక్ స్టాప్ వద్ద అరెస్ట్ చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
