Home Latest News రోజు కూలీల కోసం ఐలాక్: ఉపాధి వేదికలుగా లేబర్ అడ్డాలు.! | ఆంధ్ర ప్రదేశ్ | లేబర్ అడ్డాస్ | చంద్రబాబు నాయుడు | ILoc | ఇ-శ్రమ్ | కాంప్లెక్స్‌లు – Andhra Waves

రోజు కూలీల కోసం ఐలాక్: ఉపాధి వేదికలుగా లేబర్ అడ్డాలు.! | ఆంధ్ర ప్రదేశ్ | లేబర్ అడ్డాస్ | చంద్రబాబు నాయుడు | ILoc | ఇ-శ్రమ్ | కాంప్లెక్స్‌లు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆంధ్రప్రదేశ్‌లో అడ్డాకూలీలు, నిర్మాణ రంగ కార్మికుల పని వెతుక్కునే విధానంలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేబర్ అడ్డాల వ్యవస్థను పరిచయం చేస్తోంది. నిత్యం ఉదయాన్నే ప్రధాన కూడళ్లలో ఎండల్లో గంటల తరబడి పని కోసం నిరీక్షించే కార్మికులకు మెరుగైన సౌకర్యాలు, నైపుణ్య నమోదు, సంక్షేమ సమాచారం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1, 2026న ఈ ప్రకటన.

మొదట 15 కేంద్రాలతో ప్రారంభించాలని భావించారు, ఆ తర్వాత తొలి దశలో 25 ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ కాంప్లెక్స్‌లుగా (ఐలాక్) దీనిని విస్తరించారు. సాధారణంగా లేబర్ అడ్డా అనేది మేస్త్రీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, హెల్పర్లు వంటి కార్మికులు ఉదయాన్నే చేరి కాంట్రాక్టర్లు లేదా ఇంటి అవసరాల కోసం వచ్చే వారి కోసం ఎదురుచూసే అనధికారిక ప్రాంతం. ఇటువంటి ప్రాంతాలలో సరైన వసతులు, ఉపాధి భరోసా లేక కొందరు పని దొరక్క ఖాళీ చేతులతో వెనుదిరిగే పరిస్థితి కొనసాగుతోంది.

ఈ ప్రక్రియను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే ఐలాక్ కేంద్రాల ప్రధాన ఉద్దేశం. ఈ కేంద్రాల్లో కార్మికులు తమ నైపుణ్యాలను నమోదు చేసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మేస్త్రీలు వంటి వారి కోసం యజమానులు, కుటుంబాలు నేరుగా సంప్రదించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వెయిటింగ్ హాళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, వైఫై, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, గృహ అవసరాలకు కార్మికులను సులభంగా గుర్తించేందుకు మొబైల్ అప్లికేషన్ వంటి అంశాలు ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలతో సహా కొన్ని కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. 25 కాంప్లెక్స్‌ల నిర్వహణ ప్రక్రియ మొదలైంది. లబ్ధిదారుల సంఖ్యను గుర్తించే, జూన్ 2026 నాటికి కార్మిక ప్రభుత్వ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించిన వివరాల ప్రకారం కేంద్ర ఈ కార్మిక పోర్టల్‌లో ఏపీ నుంచి 88.67 లక్షల మంది అసంఘటిత కార్మికులు నమోదు చేసుకున్నారు. వీరిలో 18.26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ భవనాలు, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదైన వారు ఉన్నారు.

నిధుల అంశానికి వస్తే, 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో సంక్షేమ సెస్ రూపంలో రూ.1,408.58 కోట్లు వసూలైనట్లు జూన్ 2026లో కార్మిక మంత్రి తెలపగా, 2024–25 ఏపీ ఖాతాల ప్రకారం కార్మిక సంక్షేమంపై రూ.701 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. నిర్మాణ కార్మికుల నిధులతో లేబర్ అడ్డాలను అభివృద్ధి ప్రభుత్వం తెలిపినట్లుగా, ఆ మొత్తం రెండు ఆర్థిక సంవత్సరాల సెస్ వసూళ్లే తప్ప లేబర్ అడ్డాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్ కాదు. కేవలం నీడ, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించడం వల్ల కూడళ్లలో నిరీక్షించే కష్టం కొంత తగ్గినా, భవనం ఉన్నంత మాత్రాన వాటంతట అవే ఉపాధి అవకాశాలు పెరగవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి: కార్మికుల కోసం ఇక లేబర్ అడ్డాలు : సీఎం చంద్రబాబు

కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలు, ప్రజలు ఈ క్రమం తప్పకుండా వినియోగించుకోవడం, కార్మికులకు సక్రమంగా పని దొరకడం, న్యాయమైన కూలి, సకాలంలో చెల్లింపులు జరగడం కీలకమనీ.. భవిష్యత్తులో ఈ వ్యవస్థ నిర్మాణ కార్మికులు కాకుండా వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, ఇతర అసంఘటిత రంగాలకూ విస్తరించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రోజుకు రూ.500 సంపాదన కోసం ఎదురుచూస్తే కూలీకి ఉపాధి అవకాశాలు చిన్న మెరుగుదల కనిపించినా అది పెద్ద ఊరటనిస్తుంది.

రానున్న రోజుల్లో ఎన్ని కేంద్రాలు పూర్తిస్థాయి సేవలు అందిస్తాయి, వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి చూపుతోంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్‌లను నిలబెట్టడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.

మీకు నచ్చవచ్చు: సీఐఐ సదస్సు సక్సెస్: అధికారులు, సిబ్బందికి చంద్రబాబు అభినందనలు.. మీవల్లే అంటూ పొగడ్తలు.!

ఏపీకి బిగ్ రిలీఫ్: బలహీనపడిన ఆక్వాన్.. సాధారణ వాయుగుండంగా తీరం దాటే ఛాన్స్.!

[AndhraPradesh,  Labour Addas, Chandrababu Naidu,ILoc, e-Shram, Cmmplexes,  TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird