Table of Contents
సైబర్ నేరాలు, మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. సామాన్యులు, నిరాక్షరాస్యులు మాత్రమే సైబర్ మోసాల బారిన పడుతున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే. పెద్ద చదువులు చదివి.. మంచి ఉద్యోగాల్లో ఉన్నవారు, సినీ, రాజకీయ సెలబ్రిటీలు కూడా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. లక్షల్లో మోసపోతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి అనితా చౌదరికి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. సైబర్ నేరగాళ్ల వలలో పడిన అనితా చౌదరి లక్షల రూపాయలు నష్టపోయారు. పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
టాలీవుడ్ సీనియర్ నటి అనితా చౌదరి సైబర్ నేరగాళ్ల చేతిలో భారీగా మోసపోయారు. అమెరికాలో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్న ఆమెని కేటుగాళ్లు.. నకిలీ ట్రావెల్ ఏజెన్సీ పేరుతో బోల్తా కొట్టి.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.4.14 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన అనితా చౌదరి హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసముంటున్నారు. ఆ రోజుల్లో తమ కుమారుడి బర్త్ డే రాబోతుంది. ప్రస్తుతం అనితా చౌదరి కొడుకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటున్నాడు. ఈక్రమంలో అనితా చౌదరి కొడుకు పుట్టినరోజు వేడుకలకు వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ రిటర్న్ టికెట్లు బుక్ చేసుకోవాలని భావించారు. ఈ నెల 12న ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెన్సీల కోసం వెతకగా, ‘లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్’ అనే సంస్థ వివరాలు కనిపించాయి.
మాటల్లో పెట్టి ఓటీపీలు సేకరించిన నిందితుడు
వెబ్‌సైట్‌లో ఉన్న ఫోన్ నంబర్‌కు అనితా చౌదరి కాల్ చేయగా, రాజేశ్ అనే వ్యక్తి స్పందించారు. వాషింగ్టన్ డీసీకి వెళ్లి తిరిగి రావడానికి బిజినెస్ క్లాస్ టికెట్ల ధర రూ.4,14,180 అవుతుందని చెప్పాడు. బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలంటే డెబిట్ కార్డు వివరాలు అవసరమని నమ్మించి, ఆమెకు ఒక ఆన్‌లైన్ ఫారం పంపించాడు. అనితా చౌదరి ఆ ఫారంలో తన డెబిట్ కార్డు వివరాలను నమోదు చేశారు. ఆ సమయంలో ఫోన్‌లో ఆమె మాటల్లో పెట్టిన నిందితుడు, మొబైల్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లను (OTP) చెప్పాలని కోరాడు. టికెట్ల బుకింగ్ కోసమే ఓటీపీలు అడుగుతున్న ఆమె వాటిని వెల్లడించడంతో, క్షణాల్లోనే ఖాతా నుంచి నగదు మాయమైంది.
టికెట్ కన్ఫర్మేషన్ రా
కొద్దిసేపటికే క్లియర్‌ట్రిప్ ద్వారా తన బ్యాంకు ఖాతా నుంచి రూ.4,14,180 డెబిట్ అయినట్లు అనితా చౌదరి మొబైల్‌కు సందేశం వచ్చింది. అయితే విమాన టిక్కెట్లు బుక్‌లు అయినా ఎటువంటి మెసేజ్ రాలేదు. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు ఆమె గ్రహించారు. వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసి, అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, నకిలీ ట్రా ఏజెన్సీ వెనుక ఉన్న ముఠా వివరాలు, నగదు బదిలీ అయిన ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్‌లైన్ బుకింగ్‌ల పట్ల జాగ్రత్త
ఆన్‌లైన్ ద్వారా విమాన టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో సంబంధిత వెబ్‌సైట్ అత్యంత నిజమైనది కాదో ముందుగా నిర్ధారించుకోవడం అని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ కాల్స్‌లో మాట్లాడే అపరిచితులకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు, బ్యాంకు ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని, టికెట్ బుకింగ్ ఓటీపీలు అడిగే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
The post అనితా చౌదరికి కుచ్చుటోపీ.. లక్షల్లో appeared first on iDreamPost.
