Table of Contents
దీపావళి పండుగతో పాటు వరుస పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతున్న వేళ పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి, వెండి రేట్లు ఒక్కసారిగా దిగిరావడం మార్కెట్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. విపరీతంగా పెరిగిన ధరల నుంచి సిద్ధంగా లభించడంతో వినియోగదారులు ఈ పండగ పూట షాపింగ్ చేస్తున్నారు.
వారంలో రూ.5 వేలు ఢమాల్
గడిచిన వారం రోజుల్లో ప్రధాన నగరాల్లో పసిడి ధరలు సురమారు రూ.5 వేల మేర దిగి వచ్చింది.
హైదరాబాద్ మార్కెట్: అక్టోబర్ 19న (సోమవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,650గా ఉండగా, అక్టోబర్ 25న రూ.1,42,580కి చేరింది. అంటే ఒక్క వారంలోనే ఏకంగా రూ.5,070 తగ్గింది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,340 నుంచి రూ.1,30,700కి తగ్గి, ఏకంగా రూ.4,640 మేర పతనమైంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే తరహా తగ్గింపు నమోదైంది.
ఢిల్లీ మార్కెట్: దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే ధోరణి కనిపించింది. 24 క్యారెట్ల పసిడి రూ.1,47,800 నుంచి రూ.1,42,730కి పడిపోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,490 నుంచి రూ.1,30,500 స్థాయికి దిగివచ్చింది.
బంగారం బాటలోనే వెండి
పసిడితో పాటు వెండి ధరలు కూడా భారీగానే దిగివచ్చాయి. అక్టోబర్ 19 కిలో వెండి ధర రూ.2,29,000గా నమోదు కాగా, అక్టోబర్ 25 నాటికి ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో రూ.2.20 లక్షల వద్ద కొనసాగుతోంది. వారం వ్యవధిలోనే వెండి ధర కిలోపై దాదాపు రూ.9,000 మేర తగ్గింది.
బంగారం రేటు పతనానికి గల ముఖ్య కారణాలు
బంగారం ధరలు గత కొన్ని నెలల కనిష్ట స్థాయికి అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రధాన కారణం: క్రూడ్ ఆయిల్, డాలర్ బలం: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు పెరగడంతో పాటు అమెరికన్ డాలర్ బలపడటం పసిడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.
ద్రవ్యోల్బణ భయాలు,ఫెడ్ నిర్ణయాలు: అంతర్జాతీయ ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు, అక్టోబర్ 27, 28 తేదీల్లో జరగనున్న యూఎస్డరల్ రిజర్వ్ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే ప్రచారంతో పెట్టుబడిదారులు బంగారం పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు.
ఈ అంతర్జాతీయ సవాళ్ల కారణంగానే ఈ వారం రోజుల్లో బంగారం సుమారు 4 శాతం మేర క్షీణించి మూడు-నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. రాబోయే ఫెడ్ సమావేశంలో కీలక నిర్ణయాల ఆధారంగా ధరల దిశ స్పష్టమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని వ్యాపార వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
