కల్కి సినిమా వచ్చి రెండేళ్లు దాటేసింది. మరో ఏడాది తరువాత కానీ రెండో భాగం వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఆ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే వుంది ఇంకా. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్ రెండూ పూర్తి చేయాలి. అవి పూర్తి అయ్యేసరికి 2027 సమ్మర్ వస్తుంది. ఈ లోగా మరే సినిమాకు ఓకె అనకపోతే కల్కి 2 మీదకే వస్తారు.
అయితే ఈ లోగానే ఆ సినిమా నైజాం థియేటర్ హక్కుల మీద రుమాలు వేసారు ఏషియన్ సునీల్-సురేష్ బాబు కలిసి. 108 కోట్ల కు నైజాం హక్కులను తీసుకున్నారు. అయితే ఇందులో రిస్కేం లేదు. ఎందుకంటే రికవరబుల్ మోడల్ మీద తీసుకున్నారు కనుక. అదే నాన్ రికవరబుల్ అడ్వాన్స్ అంటే కాస్త ఎక్కువ, తక్కువ అనే డిస్కషన్లు వస్తాయి.
నిర్మాతకు ఇప్పటి నుంచి వడ్డీ లేని అప్పు వస్తుంది. బయ్యర్లకు రికవరీమోడల్ లో సినిమా వస్తుంది. రేపు ఈ సినిమా కనుక ఆ మేరకు చేస్తే బయ్యర్ కు దాదాపు 20 కోట్ల లాభం వస్తుంది. సీక్వెల్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. పైగా సినిమాలో కమల్ హాసన్ కూడా వున్నారు. అందుకే ఈ సినిమా ఎప్పుడు వచ్చినా ఆ మేరకు మార్కెట్ అవుతుంది. ఇటీవల నైజాంలో కాంపిటీషన్ పెరగడంతో చాలా ఎర్లీగా క్లోజ్ అయింది.
