Home సినిమా టపాసుల పొగతో! – iDreamPost – Andhra Waves

టపాసుల పొగతో! – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
టపాసుల పొగతో! - iDreamPost


దీపావళి వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ దీపాలతో వెలిగిపోతాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా టపాసులు కాలుస్తూ ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ సంబరాల వెనుక ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదం కూడా దాగి ఉంది. ముఖ్యంగా టపాసుల నుంచి వెలువడే పొగ వల్ల ఊపిరితిత్తులు, కళ్లు, శ్వాసకోశంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ పొగ మరింత ఇబ్బంది కలిగిస్తుంది.

టపాసులు కాల్చినప్పుడు గాలిలోకి సూక్ష్మ ధూళి కణాలు, రసాయన వాయువులు విడుదలవుతాయి. వీటిలో ముఖ్యంగా PM2.5 వంటి అతి సూక్ష్మ కణాలు ఉంటాయి. ఇవి మనం పీల్చే గాలితో పాటు ఊపిరితిత్తుల్లోకి లోతుగా చేరుతాయి.దీంతో శ్వాసనాళాల్లో మంట, వాపు ఏర్పడవచ్చు. నిరంతర దగ్గు, గొంతులో మంట, ఛాతీలో బరువుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిలో ఇవి మరింత తీవ్రంగా మారవచ్చు.

టపాసుల పొగ, రసాయన కణాల కళ్లకు తగలడం వల్ల మంట, దురద, ఎర్రబడటం, నీళ్లు కారడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో టపాసుల నుంచి ఎగిరే నిప్పురవ్వలు నేరుగా కళ్లకు తగిలి తీవ్రమైన గాయాలకు కారణమవుతాయి. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గరుండి పర్యవేక్షించాలి. కంటికి గాయం అయితే కళ్లను రుద్దకూడదు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

ముఖ్యంగా ఆస్తమా, COPD, అలర్జీలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు టపాసుల పొగకు దూరంగా ఉండాలి. గర్భిణులు కూడా ఎక్కువసేపు కాలుష్యం ఉన్న ప్రాంతాలు ఎక్కువ ఉండకుండా జాగ్రత్త పడాలి.ముఖ్యంగా ఆస్తమా బాధితుల్లో ఇన్‌హేలర్ వాడినా ఉపశమనం కలగకపోతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. తీవ్రమైన శ్వాస ఇబ్బంది ఉంటే అత్యవసర వైద్య సేవలను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird