Home తెలంగాణ Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న కాన్వాయ్ పైకి దూసుకొచ్చి – Andhra Waves

Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న కాన్వాయ్ పైకి దూసుకొచ్చి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


తీన్మార్ మల్లన్న : రాజకీయ నాయకుల పాదయాత్రలు, ప్రజా సమస్యలపై పోరాటాలు సాధారణంగా జనసందోహం మధ్య సాగుతుంటాయి. కానీ తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో ఊహించని ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ మల్లన్న కాన్వాయ్‌లోని కారును బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది. రెండు కార్లు తీవ్రంగా ధ్వంసం కాగా, భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉంది, రెండేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాద సమయంలో మల్లన్న కారులో లేకపోవడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

పాదయాత్రలో ఒక్కసారిగా బీభత్సం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామ సమీపంలోని గౌరెల్లి–కొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం ఈ ఘటన జరిగింది. మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగుతోంది. ఈ కోరిక చౌటుప్పల్ మండలం జైకేసారానికి చెందిన లారీ వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చి కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును ఢీకొట్టింది.

లారీ ఢీకొన్న వేగానికి ఫార్చునర్ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రతను చూసిన పాదయాత్ర కార్యకర్తలు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

భార్యాభర్తల పరిస్థితి విషమం.. చిన్నారికి తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంలో తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందన, రెండేళ్ల కుమారుడితో పాటు కారు డ్రైవర్ సురేష్ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉందని పోలీసుల సమాచారం. చిన్నారి కూడా తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో రెండు కార్లు తీవ్రంగా దెబ్బతినడంతో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది.

మల్లన్నకు తప్పిన పెను ప్రమాదం

ఈ ఘటనలో అత్యంత కీలకమైన విషయం.. ప్రమాదం సమయంలో తీన్మార్ మల్లన్న తన ఫార్చునర్ కారులో లేరు. ఆయన ఇప్పటికే కారును వదిలి ముందుగా కాలినడకన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో లారీ నేరుగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టేందుకు మల్లన్నకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఆయన కారులోనే ఉండి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదంపై అనుమానాలు.. అసలు కారణమేంటి?

ఈ ఘటన తర్వాత మరో చర్చ మొదలైంది. పాదయాత్ర సాగుతున్న సమయంలోనే కాన్వాయ్‌లోని కారును లారీ వెనుక నుంచి ఢీకొట్టడం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం నిర్ధారణ కాలేదు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీరును పరిశీలించి వాహనాల వివరాలను సేకరించారు. లారీ డ్రైవింగ్ తీరు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఇతర దర్యాప్తు చేస్తున్నారు.

మొత్తానికి తీన్మార్ మల్లన్న పాదయాత్రలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా రెండేళ్ల చిన్నారి గాయపడటం, భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉండటంతో విషాదాన్ని నింపింది. ఇది సాధారణ రోడ్డు ప్రమాదమా? మరేదైనా కారణం ఉందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird