ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాల్లోకి చొరబడింది. ఏఐతో పాటు నష్టాలు కూడా ఎదురవుతున్నాయి. కొన్ని కంపెనీలు ఏఐని ఉద్యోగుల మీద అస్త్రంలా వాడుతున్నారు. తాజాగా, న్యూజిలాండ్‌కు చెందిన అతిపెద్ద రిటైల్ సంస్థ ‘ది వేర్‌హౌస్ గ్రూప్’లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై పని ప్రదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా పెరిగిందని, కనీసం బాత్రూమ్కు వెళ్లిన సమయాన్ని కూడా ట్రాక్‌లో ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ కఠిన ఆంక్షల వల్ల గిడ్డంగులలోనే మలవిసర్జన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చ్ కేంద్రాలకు చెందిన 300 మందికి పైగా ఉద్యోగులు ఈ వారం నిరసన కార్యక్రమం. ఈ సమస్యపై తాను గత ఎనిమిది నెలలుగా పోరాడుతున్నట్లు యూనియన్ ఆర్గనైజర్ హెలీ కోర్ట్నీ ఏర్పాటు. బాత్రూమ్ బ్రేక్‌లు తీసుకున్న ఉద్యోగులను మందలిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆమె రేడియో న్యూజిలాండ్‌తో మాట్లాడుతూ.. ”ఉద్యోగులు టాయిలెట్‌కు వెళ్తుంటే సూపర్వైజర్లు, మేనేజర్లు వారి వెంట పడి మందలించడం అత్యంత హాస్యాస్పదం. ఇది ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే.
సరుకులను ఎత్తడానికి కంపెనీ భారీ రోబోలను తీసుకొచ్చింది. అలాగే భౌతిక తనిఖీ బృందాల స్థానంలో ఏఐ ఆధారిత డ్రోన్లను నియమించింది. పనితీరును మెరుగుపరిచే సాంకేతికతకు కార్మికులు వ్యతిరేకం కాదు. అయితే, తమ ఉద్యోగ భద్రతపై యాజమాన్యం హామీ ఇవ్వాలి. బాత్రూమ్లో ఉద్యోగులు ఎంత సమయం గడుపుతున్నారో ఏఐ ద్వారా లెక్కిస్తున్నారు. దీనివల్ల టాయిలెట్‌కు వెళ్లకుండా ఆపుకునే ప్రయత్నంలో గిడ్డంగి ఫ్లోర్‌పైనే మలవిసర్జన జరిగిన ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. మేము ఫ్లోర్‌పై వ్యర్థాలను చూశాము. నేను గట్టిగా ప్రశ్నించిన తర్వాత అది ఆగింది. అంతకుముందు ఇలాంటి ఘటనలు జరిగాయి. ఎవరు చేశారో తెలియకపోయినా, అలాంటి పరిస్థితి రావడం ఉద్యోగులకు ఎంతో అవమానకరం” అని కోర్ట్నీ ఆవేదన వ్యక్తం చేశారు.

