Home సినిమా త్రివిక్రమ్, చినబాబు మధ్య విభేదాలు: ‘గాడ్ ఆఫ్ వార్’ ఆగిపోయిందన్న వార్తలకు ఒకే ఫొటోతో చెక్.! – Andhra Waves

త్రివిక్రమ్, చినబాబు మధ్య విభేదాలు: ‘గాడ్ ఆఫ్ వార్’ ఆగిపోయిందన్న వార్తలకు ఒకే ఫొటోతో చెక్.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు మధ్య విభేదాలు వచ్చాయని.. దీంతో ఆయన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ బయటకు వస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో.. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా కూడా ఆగిపోయే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో తారక్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

కట్ చేస్తే.. ఈ రూమర్స్‌కు సమాధానం చెప్పేలా మూవీ టీమ్ తాజాగా ఓ ఫొటోను విడుదల చేసింది. ఇందులో నిర్మాత చినబాబు, ఎన్టీఆర్, త్రివిక్రమ్, కళ్యాణ్ రామ్ నలుగురు కలిసి నవ్వుతూ కనిపించారు. వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారానికి ఈ ఒక్క ఫొటోతోనే గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇక ‘గాడ్ ఆఫ్ వార్’ విషయానికి వస్తే.. ఇది సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ మూవీ. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని త్రివిక్రమ్ స్వయంగా గతంలో ఉన్నారు. అంతేకాదు ‘గాడ్ ఆఫ్ వార్’ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు చూపించారు. ‘వారణాసి’ తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబడిన సినిమాగా ఇది నిలవనుంది.

ఇది కూడా చదవండి: ‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.?

గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలవబోత ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ తొలిసారిగా పౌరాణిక నేపథ్యాన్ని, ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

మొత్తానికి చినబాబు, త్రివిక్రమ్ మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలకు ఈ ఫొటోతో తెరపడింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ చిత్రం తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

మీకు నచ్చవచ్చు:
నిర్మాతగా మారుతున్న బాలయ్య కుమార్తె.. హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా.?
బాక్సాఫీస్ ప్రభంజనం.. 8 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.!

[God Of War, Jr NTR, Trivikram Srinivas, Chinnababu, Kalyan Ram]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird