US Flight Disruptions: అమెరికా విమానయాన చరిత్రలో అరుదైన పరిణామం సంభవించింది. అన్ని విమానాల టేక్ ఆఫ్ లను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎయిర్ ట్రాఫిక్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాలలోనే చిక్కుకుపోయారు. కొన్ని గంటల తర్వాత విమానాల రాకపోకలకు అనుమతి లభించలేదు.. ప్రయాణ అంతరాయాలు కొనసాగుతున్నాయి. అమెరికా విమాన రంగాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ […]
US Flight Disruptions: అమెరికా విమానయాన చరిత్రలో అరుదైన పరిణామం సంభవించింది. అన్ని విమానాల టేక్ ఆఫ్ లను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎయిర్ ట్రాఫిక్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాలలోనే చిక్కుకుపోయారు. కొన్ని గంటల తర్వాత విమానాల రాకపోకలకు అనుమతి లభించలేదు.. ప్రయాణ అంతరాయాలు కొనసాగుతున్నాయి.
అమెరికా విమాన రంగాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ నియంత్రిస్తూ ఉంటుంది. అయితే ఈ సంస్థ నిర్వహించిన తనిఖీలలో దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్య ఏర్పడినట్లు గుర్తించబడింది. ఒక ప్రాంతం నుండి మరొక విమానాన్ని నిలిపివేసే సమయంలో వాటి కదలికలను పర్యవేక్షించడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పైలెట్లు.. కంట్రోలర్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ.. విమానాల రాకపోకలను సమన్వయం చేస్తారు.
ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య ఏర్పడిన నేపథ్యంలో విమానాల సురక్షిత ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ముందుగానే అంచనా వేశారు. దీనితో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విమానాల టేక్ ఆఫ్ ను నిలిపివేయాలని నిర్ణయించారు. అమెరికాలో 22 ప్రాంతీయ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రాలను ప్రభావితం చేసిన ఈ సమస్యను సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు.
అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. న్యూయార్క్.. చికాగో. లాస్ ఏంజిల్స్.. ఫిలడెల్ఫియా.. హ్యూస్టన్ వంటి నగరాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు విమానంలోకి ఎక్కిన తర్వాత కూడా తిరిగి టెర్మినల్స్ కు రావాల్సి వచ్చింది. మరికొందరు గంటల తరబడి విమానాశ్రయాలలోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విమానాల రద్దు.. ఆలస్య కారణంగా వేలాదిమంది ప్రయాణికులు తమ ప్రణాళికలను తలకిందులు చేసుకున్నారు. నవంబర్ 13న ఒక్కరోజే 4700 పైగా విమానాల రద్దు అయ్యాయి. పదివేలకు పై అభిమానులు ఆలస్యంగా నడిచారు. నవంబర్ 14న కూడా వందలాది విమానాలు రద్దయ్యాయి. అదే శుక్రవారం రాత్రి మొత్తం గ్రౌండ్ స్టాప్ ను ఎత్తేశారు. దీంతో విమానాలు రాకపోకలు మొదలయ్యాయి. కాకపోతే చాలా విమానాలు ఇంకా విమానాశ్రయాలలోనే ఉండిపోయాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలం చెల్లిన పరికరాలను వాడటం అమెరికా చరిత్రను ప్రపంచ దేశాల ముందు చులకన చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. దేశాల మీద యుద్ధాలు చేసే అమెరికా ముందు తన రాతను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
