హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మరో ఆసక్తికరమైన మూవీ అందుబాటులో ఉంది. థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’ ఇప్పుడు యూట్యూబ్లో ఉచితంగా వీక్షించవచ్చు. ఎస్తేర్ నొరోన్హా, ధన్య బాలకృష్ణ, సుప్రీత, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవీకే దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథేంటో ఓ లుక్ వేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే…ఈ సినిమాలో శివ కంఠమనేని సీఐ ఈశ్వర్ పాత్రలో నటించారు. కొన్ని కారణాలతో ఆయన సస్పెన్షన్కు ఉన్నారు. ఆయన భార్య భానుమతి పాత్రలో ధన్య బాలకృష్ణ కనిపిస్తారు. భానుమతి సోదరి భార్గవి (సుప్రీత) యూట్యూబ్లో పాపులర్ కావాలని ప్రయత్నించాలి. దెయ్యాల గురించి వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటుంది.
ఈ ఓ వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్తో అమరావతి అనే గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం ఉన్న ఓ కుటుంబంతో కలిసి వెళ్తుంది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోతాయి.
అమరావతి గ్రామంలో జమీందారు వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్ నొరోన్హా) హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఆమె ఆత్మగా తిరిగి వస్తుందని కథలో చూపించారు. అసలు రాజేశ్వరిని ఎవరు హత్య చేశారు? ఆమె ఆత్మకు ఈశ్వర్ కుటుంబానికి సంబంధం ఏమిటి? అక్కడికి వెళ్లిన కుటుంబానికి ఎదురైన సమస్యలేంటి? అనేది మిగిలిన కథ. ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే యూట్యూబ్ లో చూసేయండి.
మరిన్ని ఓటిటి అప్డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
