Home Latest News విజయవాడ మేయర్ ఎన్నిక: డిపాజిట్ కోల్పోయిన ఏబీవీ.. ఒటమి ఒప్పుకోలు.. అంతలోనే కుట్ర ఆరోపణలు.! | ఓటమిపై ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు | విజయవాడ మేయర్ ఎన్నికలు | కుట్ర | ఏపీ రాజకీయాలు. – Andhra Waves

విజయవాడ మేయర్ ఎన్నిక: డిపాజిట్ కోల్పోయిన ఏబీవీ.. ఒటమి ఒప్పుకోలు.. అంతలోనే కుట్ర ఆరోపణలు.! | ఓటమిపై ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు | విజయవాడ మేయర్ ఎన్నికలు | కుట్ర | ఏపీ రాజకీయాలు. – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


విజయవాడ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఏబీ వెంకటేశ్వరరావు మొదట హుందాగా ఓటమిని అంగీకరించారు. అయితే అంతలోనే ఏమైందో ఏమో.. తన ఓటమి వెనుక కుట్ర ఉందంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు ఇంత పట్టున్న ప్రాంతాల్లో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.

దీంతో ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పోటీ చేసిన విజయవాడ మేయర్ ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. నిజాయితీ పరుడిగా, మేధావిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మంచి గుర్తింపు ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు మొదట ఓటమిని హుందాగా అంగీకరించారు. కానీ 24 గంటలు తిరగక ముందే తనను ఓడించేందుకు కుట్ర పన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ మేయర్ ఎన్నికల్లో ఓటమి పాలైనా తాను రాజకీయాల నుంచి వైదొలగే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. కావాలనే తనపై కుట్ర పన్ని ఓడించారని ఆరోపించిన ఆయన, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను కొందరు పట్టించుకోలేదు.

విజయవాడ మేయర్ ఎన్నికలలో ఏబీవీ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినప్పటి నుంచే ఆయన పోటీలో నిలవడం.. వైసీపీకి మేలు చేయడానికేనా అన్న సందేహాలు పరిశీలకులు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో వేధింపులకు గురైన ఆయన విజయవాడ మేయర్ అభ్యర్థిగా స్వతంత్రంగా బరిలోకి దిగడం వల్ల తెలుగుదేశం కూటమి ఓట్లు చీలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, దీని వల్ల ఏబీవీకి గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేకపోయినా, వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత ఏబీవీ పోటీ వల్ల తెలుగుదేశం కూటమి ఓట్లు చీలలేదని తేటతెల్లమైంది. దీంతో సోషల్ మీడియాలో ఏబీవీపై ఓ రేంజ్ లో విమర్శల సెటైర్లు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే ఏబీవీ స్ట్రాంగ్ గా స్పందించారు. తన ఓటమికి కొందరు కుట్రపన్నారని ఆరోపించడంతో ఆగకుండా తాను ఓటమి పాలు కాలేదనీ, కొందరు తనను కావాలనే ఓడించారు. తనను నమ్మి ఓటు వేసిన 12 మంది ప్రజల నమ్మకమే తనకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. తన పరువు పోయిందని కొందరు సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: విజయవాడ మేయర్ ఎన్నికల్లో ఘోర పరాజయం: ఏబీవీ పొలిటికల్ ఎంట్రీపై నీలినీడలు.!

విజయవాడ మేయర్ స్థానానికి పోటీ చేసినప్పుడు తాను కేవలం పదవి కోసం పాకులాడలేదని, ప్రజా సమస్యలపై గళం విప్పడమే తన ధ్యేయమని ఏబీవీ తెలిపారు. ముఖ్యంగా బుడమేరు సమస్యపై నిలదీయడం, ఇచ్చిన హామీలపై ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజలకు తన బాధ్యతగా భావించానని ఆయన గుర్తుచేసుకున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసం కాకుండా ప్రజాక్షేమం కోసమే చేశానని స్పష్టం చేశారు.

తనను రాజకీయాలకు దూరం చేయడం, తన నుంచి మద్దతుదారులను వేరు చేయాలని చూస్తున్న శక్తుల ప్రయత్నాలు నెరవేరవని ఏబీవీ ప్రకటించింది.అ హెళనలతో, బురదజల్లే ప్రచారాలతో తనను వెనక్కి తగ్గించగలమని భావించే వారు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నట్లేనన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ప్రత్యక్ష ప్రజా సమస్యలపై తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. భవిష్యత్తులోనూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల గొంతుకగా మారుతానని ఏబీవీ కుండబద్దలు కొట్టారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది.

మీకు నచ్చవచ్చు: ఏపీ పుర ఫలితాల్లో కూటమి హవా: వైసీపీ కుదేలు.!

కుప్పంలో టీడీపీ ప్రభంజనం..32కు 32 వార్డులు కైవసం.!

[AB Venkateswara Rao Sensational Comments on Defeat,  Vijayawada Mayor Elections, Conspiracy,  AP politics, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird