Home అంతర్జాతీయం Brazil Waterfall: ఆకాశం నుంచి జలపాతం.. కళ్లింతలు చేసుకుని -Andhra Waves

Brazil Waterfall: ఆకాశం నుంచి జలపాతం.. కళ్లింతలు చేసుకుని -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Brazil Waterfall: ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు మన కళ్ళముందే కనిపించే దృశ్యాలు నిజమా? లేక ఏఐ సృష్టించిన అద్భుతమా? అనే సందేహాన్ని కలిగిస్తాయి. బ్రెజిల్ దేశంలో కాసా డి పెడ్రా (కాసా డి పెడ్రా) గో దగ్గర కనిపించిన ఒక అద్భుతమైన దృశ్యం ఇప్పుడు అలాంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గుహ పైభాగం నుంచి నీరు కిందకు జాలు వారు తుంటే.. లోపల నుంచి పైకి చూసేవారికి ఆకాశం నుంచే జలపాతం కురుస్తున్నట్టుగా అనిపిస్తోంది. […]

బ్రెజిల్ జలపాతం: ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు మన కళ్ళముందే కనిపించే దృశ్యాలు నిజమా? లేక ఏఐ సృష్టించిన అద్భుతమా? అనే సందేహాన్ని కలిగిస్తాయి. బ్రెజిల్ దేశంలో కాసా డి పెడ్రా (కాసా డి పెడ్రా) గో దగ్గర కనిపించిన ఒక అద్భుతమైన దృశ్యం ఇప్పుడు అలాంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గుహ పైభాగం నుంచి నీరు కిందకు జాలు వారు తుంటే.. లోపల నుంచి పైకి చూసేవారికి ఆకాశం నుంచే జలపాతం కురుస్తున్నట్టుగా అనిపిస్తోంది.

ఈ గుహ ప్రత్యేకత విశాలమైన ముఖద్వారం..సావో పాలో రాష్ట్రంలోని ఇపొరంగా ప్రాంతంలో, ఆల్టో రీబీ రా టూరిజం స్టేట్ పార్క్ (PETAR) పరిధిలో ఉన్న కాసా డి పెడ్రా గుహ ముఖద్వారం ఎత్తును పరిశోధకులు లేజర్ సాంకేతికతతో కొలిచారు. ఈ అధ్యాయంలో దాని ఎత్తు సుమారు 197 మీటర్లు. అంటే దాదాపుగా 646 అడుగులు. గుహ పైభాగంలో రాత్రి నిర్మాణాల నుంచి నీరు కిందకు వస్తున్నప్పుడు ఆ దృశ్యం మరింత అద్భుతంగా ఉంటుంది. గుహలోపల చీకటి.. ఎదురుగా కనిపించే వెలుతురు.. ఎత్తు నుంచి పడే నీటి ధారలు కలిసి ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. అందుకే ఈ దృశ్యాన్ని చూసిన వారికి ఆకాశమే నీటిని కిందకు జార విడుస్తున్నట్టుగా అనిపిస్తుంది.

ప్రకృతి రూపొందించిన ఈ అందమైన దృశ్యం వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. భారీగా వర్షాలు కురిసినప్పుడు.. గుహలో నీటిమట్టం వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. గతంలో వరదల కారణంగా ప్రాణ నష్టం జరిగింది. అందువల్ల ఈ గుహను 2003 నుంచి సాధారణ సందర్శకులు చూసే వారు లేకుండా మూసివేశారు. ప్రస్తుతం అనుమతి పొందిన నిపుణులు.. సంబంధిత అధికారులు మాత్రమే అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఏ ఐ సృష్టించిన దృశ్యాలు నిజమైన ప్రకృతి అద్భుతాలను తలపిస్తున్న నేటి కాలంలో.. బ్రెజిల్‌లో వైరల్‌గా మారిన ఈ దృశ్యానికి సంబంధించిన దృశ్యాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఈ జలపాతానికి విశేషమైన ప్రజాదరణ లభిస్తోంది. అయితే పర్యాటకులను అనుమతించడం లేదు. కేవలం ప్రత్యేక అనుమతి పొందిన పర్యాటకులు, అధికారులు మాత్రమే అక్కడికి వెళ్లే అర్హత ఉంది. ఈ ప్రాంతంలో పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మరిన్ని మర్మాలను వెలికి తీసే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird