రణ్బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన అత్యంత ప్రతిష్టాత్మక సినిమా పార్ట్ 1 రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ సినిమా మొదటి భాగం విడుదల కాకముందే.. రెండో భాగానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ను రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా పంచుకున్నారు. ‘రామాయణ పార్ట్-2’ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
రామాయణ పార్ట్-2ను 2027లో విడుదల చేయడానికి మేకర్స్ భావించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే, అవుట్ పుట్ కారణాల దృష్ట్యా సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. రామాయణ పార్ట్ 2ను ఒక ఏడాది ముందుకు జరిపి, 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. కథకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ అదనపు సమయాన్ని తీసుకుంటారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ”ఈ ప్రతిష్ట ప్రాజెక్ట్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందించాము. ఈ చిత్రానికి సంబంధించి రెండు మాస్టర్లను సిద్ధం చేశాము. మొదటి ప్రత్యేక ఆంగ్లంలో డబ్ చేయడానికి ఎడిటింగ్, స్క్రిప్ట్ రీ-రైట్ అవసరం. దీనివల్ల కొంత సమయం పట్టింది. సినిమా ముగింపు మరింత అద్భుతంగా, మొదటి భాగం కంటే ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నాను.
ఇంతటి భారీ బడ్జెట్ మరియు భారీ స్థాయి నిర్మాణం న్యాయం చేయాలంటే ఈ అదనపు ఒక సంవత్సరం కాలం ఖచ్చితంగా అవసరమని నేను నమ్ముతున్నాను. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే కంగారుగా కాకుండా, తగినంత సమయం తీసుకుని గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
#రామాయణం పార్ట్ 3🔥
కాబట్టి నమిత్ మల్హోత్రా ద్వారా 3వ భాగాన్ని ధృవీకరించే అవకాశం ఇంకా ఉంది
నితేష్ తివారీ చిరునవ్వు చూడండి
#రణబీర్ కపూర్ #యష్ #సాయిపల్లవి https://t.co/KwvKx7NbJt
— Prof DK2 (@who_are_u07) నవంబర్ 3, 2026

