Home అంతర్జాతీయం us midterm elections results : అమెరికా కాంగ్రెస్ పై ఆధిపత్య పోరు.. -Andhra Waves

us midterm elections results : అమెరికా కాంగ్రెస్ పై ఆధిపత్య పోరు.. -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


డెమోక్రాట్ల వైపు మొగ్గుతున్న ఓటర్లు..
రిపబ్లికన్లలో పెరుగుతున్న ఆందోళన..
సెనెట్‌లోనూ మారుతున్న సమీకరణలు!

us midterm elections results అమెరికా రాజకీయాల్లో మరో కీలక పోరుకు తెరలేచింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ మధ్యంతర ఎన్నికలు ఆయన భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారాయి. నవంబర్ 3న లక్షలాది మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యంలో తాజా సర్వేలు రిపబ్లికన్ పార్టీకి ప్రతికూల సంకేతాలు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికలపై నిర్వహించిన అభిప్రాయ సేకరణల్లో డెమోక్రాట్లు ఆధిక్యంలోకి రావడం రిపబ్లికన్లలో ఆందోళన పెంచుతోంది. సాధారణంగా రిపబ్లికన్లకు అనుకూలంగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు పుంజుకుంటుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ట్రంప్ పాలనకు రెఫరెండంగా మధ్యంతర ఎన్నికలు

ఈ ఎన్నికలను ట్రంప్ రెండో విడత పాలనపై ప్రజాభిప్రాయ సేకరణగా రాజకీయ విశ్లేషకులు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, నిత్యావసర వస్తువుల ధరలు, వలస విధానాలు, దిగుమతి సుంకాలు, ఇరాన్‌తో యుద్ధ పరిణామాలు వంటి అంశాలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత ఓట్ల రూపంలో ప్రతిఫలించకుండా చూడటం రిపబ్లికన్లకు పెద్ద సవాలుగా మారింది.

అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీరితోపాటు 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకూ ఉన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్‌లో ఏ పార్టీకి ఆధిపత్యం లభిస్తుందో నిర్ణయించుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రంప్ పాలనలో మిగిలిన రెండేళ్ల కాలంలో ఆయన ప్రతిపాదించే విధానాలు, చట్టాలకు కాంగ్రెస్ నుంచి ఎంతమేర మద్దతు లభిస్తుందనేది ఈ ఎన్నికలతో తేలనుంది.

డెమోక్రాట్‌లకు 8.4 శాతం అధిక్యం!

తాజా జాతీయ సర్వేలు డెమోక్రాట్‌లకు అనుకూలంగా ఉన్నాయి. నవంబర్ 3న నవీకరించిన పోలింగ్ అగ్రిగేషన్ ప్రకారం, కాంగ్రెస్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే ప్రశ్నపై డెమోక్రాట్లు సుమారు 8.4 శాతం పాయింట్ల అధికరణ ఉంది. అక్టోబర్ 31న అల్ జజీరా ప్రస్తావించిన రియల్ క్లియర్ పోలింగ్ సగటులోనూ డెమోక్రాట్‌లకు 51.4 శాతం, రిపబ్లికన్‌లకు 43.2 శాతం మద్దతు నమోదైంది. అంటే 8.2 శాతం పాయింట్ల అధిక్యం కనిపించింది.

ఏకనామిస్ట్/యుగోవ్ నిర్వహించిన మరో సర్వేలో 44 శాతం మంది ఓటర్ల ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిపత్యం సాధిస్తారని అంచనా వేయగా, 31 శాతం మంది మాత్రమే రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారని అభిప్రాయపడ్డారు. సెనెట్ విషయంలో మాత్రం కొంత గట్టిగానే ఉంది. 39 శాతం మంది డెమోక్రాట్ల విజయాన్ని అంచనా వేయగా, 36 శాతం మంది రిపబ్లికన్లకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

సెనెట్‌లోనూ మారుతున్న సమీకరణలు

ఎన్నికల విశ్లేషకుడు నేట్ సిల్వర్‌కు చెందిన సిల్వర్ బులెటిన్ విడుదల చేసిన తుది అంచనాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధించే అవకాశాలు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయని, సెనెట్‌ను సైతం కైవసం చేసుకునే దిశగా వారు బలమైన స్థితికి చేరుకున్నారని ఈ అంచనాలు సూచిస్తున్నాయి.

టెక్సాస్, ఒహియో, మిచిగాన్, మైన్, అయోవా కీలక రాష్ట్రాల్లో సెట్ పోరులో డెమోక్రాట్లు ముందంజలో ఉన్నట్లుగా పోలింగ్ సగటులు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఒహియో, కాన్సాస్ వంటి సంప్రదాయ రిపబ్లికన్ అనుకూల రాష్ట్రాల్లో డెమోక్రాట్లు గట్టి పోటీని ప్రదర్శించారు. ఈ పరిణామం రిపబ్లికన్లకు కొత్త తలనొప్పిగా మారింది.

చరిత్ర కూడా రిపబ్లికన్లకు ప్రతికూలమేనా?

అమెరికా రాజకీయ చరిత్రలో మధ్యంతర ఎన్నికల్లో అధికారం ఉన్న అధ్యక్షుడి పార్టీకి ఎదురుదెబ్బలు తగలడం సాధారణంగా కనిపిస్తుంది. గత 80 ఏళ్లలో జరిగిన 20 మధ్యంతర ఎన్నికల్లో 18 సార్లు అధ్యక్షుడి పార్టీ ప్రతినిధుల సభలో స్థానం కోల్పోయింది. ఈ చారిత్రక పరిణామం కూడా ట్రంప్ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.

అయితే సర్వేల్లో ఆధిక్యం కనిపించిందని డెమోక్రాట్ల విజయం ఖాయమని చెప్పలేం. మూడు నుంచి నాలుగు శాతం పాయింట్ల తేడా కూడా పోలింగ్ మార్జిన్‌లో ఉండే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం, చివరి నిమిషంలో ఓటర్ల ఫలితాలు, తటస్థ ఓటర్ల మొగ్గు వంటి అంశాలను ప్రభావితం చేయవచ్చు.

ఈ మధ్యంతర ఎన్నికలు అమెరికా రాజకీయాల్లో కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతినిధుల సభతోపాటు సెనెట్‌లోనూ డెమోక్రాట్లు సాధిస్తే ట్రంప్ పాలనపై కాంగ్రెస్ నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటే ట్రంప్‌కు వచ్చే ఏడాదికి మరింత బలంగా పాలన సాగించే అవకాశం లభిస్తుంది. ఈ పోరులో అమెరికా ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird