YSRCP : నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉంది వైసీపీ పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కడా కూడా ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసినట్టు కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలుపెడితే సామాన్య ప్రజల వరకు వైసిపిని ఇప్పటికి దూరం పెడుతూనే ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా వైసీపీ మీద ఏపీ ప్రజలకు కనీసం ఇసుమంత కూడా సానుభూతి పెరగలేదు. కానీ ఈ డైవర్ట్ చేయడానికి వైసిపి […]
YSRCP: నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉంది వైసీపీ పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కడా కూడా ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసినట్టు కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలుపెడితే సామాన్య ప్రజల వరకు వైసిపిని ఇప్పటికి దూరం పెడుతూనే ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా వైసీపీ మీద ఏపీ ప్రజలకు కనీసం ఇసుమంత కూడా సానుభూతి పెరగలేదు. కానీ ఈ డైవర్ట్ చేయడానికి వైసిపి చేయని ప్రయత్నం లేదు. స్థానిక ఎన్నికల ఫలితాల్లో తాను గెలవని సీట్లను కూడా గెలిచినట్టు సొంత మీడియాలో వేసుకోవడం.. సొంత సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ లో ప్రచారం చేయడం వైసీపీకే చెల్లింది.
వైసిపి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలకు తెగబడింది. ఓట్ల లెక్కింపు మొదలైన తొలి గంట నుంచి ఉయ్యూరు.. ఆత్మకూరు.. తుని పురపాలక స్థానాల్లో లీడ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా ఐదు కీలక పురపాలక సంఘాల్లో వైసిపి తిరుగులేని స్థాయికి సొంత డప్పు కొట్టుకుంది.
అయితే బ్యాలెట్ బాక్స్ లో నుంచి ఓట్లు వస్తున్నకొద్ది సోషల్ మీడియాలో సాగిన అసత్య ప్రచారం ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. ఆయా పురపాలకాల. పూర్తిగా ప్రారంభం నుంచి తెలుగుదేశం.. జనసేన.. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తిరుగులేని స్థాయిని కొనసాగించారు. ఉయ్యూరు.. ఆత్మకూరు మున్సిపాలిటీలలో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. తుని మున్సిపాలిటీలో కూడా కూటమి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. కనీసం కొన్ని స్థానాల్లో కూడా వైసిపి సత్తా చూపించలేకపోయింది. కేడర్‌లో ధైర్యాన్ని పెంపొందించలేకపోయింది. కాకపోతే ఈ సమయంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం నీతికి, విలువలకు తిలోదకాలు వదిలింది. అడ్డగోలుగా ప్రచారం మొదలుపెట్టింది. వైసిపి చేస్తున్న ప్రచారాన్ని కొద్దిసేపు జనాలు నిజం అని నమ్మారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన నేపథ్యంలో వైసిపి జిమ్మిక్కులు పేకా మేడల మాదిరిగానే కూలిపోయాయి. అది జనాలకు అర్థమై మరొకసారి ఆ పార్టీని దూరం పెట్టారు.
