Home ఆంధ్రప్రదేశ్ YS Jagan : జగన్ మీద కేసు.. పులివెందులలో ఆ ఒక్కటి దెబ్బ – Andhra Waves

YS Jagan : జగన్ మీద కేసు.. పులివెందులలో ఆ ఒక్కటి దెబ్బ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YS Jagan Mohan Reddy : డెమోక్రసీలో ప్రతి ఓటుకు అత్యంత కీలకం. అందుకే రాజకీయ పార్టీలు ఓట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎవరైనా ఓటర్లతో ఓటు వేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలకు ఓటు విలువ తెలుసు. ఓటర్ల విలువ కూడా తెలుసు. అందువల్లే ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఓటర్లతో ఓట్లు వేయించడానికి రాజకీయ పార్టీల నాయకులు చేత విధాలుగా ప్రయత్నాలు […]

YS Jagan Mohan Reddy : డెమోక్రసీలో ప్రతి ఓటుకు అత్యంత కీలకం. అందుకే రాజకీయ పార్టీలు ఓట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎవరైనా ఓటర్లతో ఓటు వేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలకు ఓటు విలువ తెలుసు. ఓటర్ల విలువ కూడా తెలుసు. అందువల్లే ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఓటర్లతో ఓట్లు వేయించడానికి రాజకీయ పార్టీల నాయకులు చేత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విషయం ఏపీలో వైసీపీ అధినేతకు తెలియకుండా పోయింది. ఓటు అనేది రాజ్యాంగం పౌరుడికి ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన హక్కు. ప్రజాస్వామ్యం కొనసాగుతున్న విధానానికి ఓటు అనేది అత్యంత కీలకమైనది. కానీ ఈ పరిశీలన జగన్ తేలికగా తీసిపారేశారు. ఎన్నికల సమయంలో జగన్ తన రాజకీయ ఆపరిపక్వతను నిరూపించారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని బయట పెట్టుకున్నారు. పులివెందులలో 34 వార్డులలో జగన్ కు ఓటు హక్కు ఉంది. ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయకుండానే వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అవమానించడమే.

ఒక రకంగా టిడిపి మీద ఆయన కోపం ఉంటే దానిని ఓటు వేసి చూపించాలి. తన పార్టీలో కార్యకర్తలని.. మిగిలిన ఓటర్లకు ఓటు ద్వారా టిడిపి ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని పిలుపునివ్వాలి. అలా కాకుండా ఎన్నికల ప్రక్రియ మొదలైన కొద్దిసేపటికి రీపోలింగ్ కావాలని ఆయన డిమాండ్ చేయడం.. ధర్నాలకు దిగడం.. నిరసనల పేరుతో దూకుడుగా వ్యవహరించడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. భాకరాపురం బూత్ కు ఆయన వచ్చింది ఓటు వేయడానికి. కానీ అసలు ఉద్దేశం వేరే విధంగా ఉంది. ఉదయాన్నే రగడ సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం సర్వనాశనం చేయాలని సంకల్పించారు. ఆయన ముందస్తు వ్యూహం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. సొంతవార్డులో.. సొంత నియోజకవర్గంలో ఓటు వేయకుండా వెళ్లిపోయిన నాయకుడు.. రాష్ట్రంలో పార్టీ నాయకులకు.. ఓటర్లకు ఎటువంటి భరోసా కల్పిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఓటు వేయకుండా వెళ్లిపోవడం.. ఆర్ వో ఆఫీస్ ముందు ధర్నా చేయడంతో.. మాజీ సీఎం జగన్ మీద కేసు నమోదు అయింది. మున్సిపాలిటీ పోలింగ్ రోజున పులివెందుల ఆర్ఓ ఆఫీస్ వద్ద వైసీపీ నాయకులు.. ఏజెంట్లతో కలిసి జగన్ ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు అభియోగాలు మోపారు. జగన్ మీద కేసు నమోదు చేశారు. కాగా, తన ఒక్క ఓటు విలువైనది కాదని ఆయన అనుకోవచ్చు. ఒకవేళ ఆ వార్డులో వైసిపి అభ్యర్థికి గెలవడానికి ఒక ఓటు కావాల్సి వస్తే.. అప్పుడు జగన్ ఏం చేస్తారు.. ఏం చేయగలుగుతారు.. అందువల్లే ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలి. వచ్చిన దగ్గర జారవిడుచుకుంటే ఇదిగో ఇలాగే విమర్శల పాలు కాక తప్పదు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird