Home ఆంధ్రప్రదేశ్ YS Jagan Mohan Reddy: ఎదురెళ్లిన దస్తగిరి.. ఆగిన జగన్ కాన్వాయ్.. – Andhra Waves

YS Jagan Mohan Reddy: ఎదురెళ్లిన దస్తగిరి.. ఆగిన జగన్ కాన్వాయ్.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YS Jagan Mohan Reddy: ఉమ్మడి కడప జిల్లాలో వైయస్ కుటుంబానికి తిరుగులేదు. దశాబ్దాలుగా ఆ జిల్లా వారికి కంచుకోట. ముఖ్యంగా పులివెందుల అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గడపతో.. ప్రతి మనిషితో వారికి సంబంధం ఉంటుంది. జగన్ అంతకంటే ముందు వైఎస్.. పులివెందుల నియోజకవర్గంలో ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు. రోజులు మొత్తం ఒకే విధంగా ఉండవు అన్నట్టు.. ఇప్పుడు పులివెందులలో పరిస్థితులు మారిపోతున్నాయి. వైసిపికి అక్కడ తిరుగులేదు అనే స్థాయి నుంచి.. ఫ్యాన్ […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఉమ్మడి కడప జిల్లాలో వైయస్ కుటుంబానికి తిరుగులేదు. దశాబ్దాలుగా ఆ జిల్లా వారికి కంచుకోట. ముఖ్యంగా పులివెందుల అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గడపతో.. ప్రతి మనిషితో వారికి సంబంధం ఉంటుంది. జగన్ అంతకంటే ముందు వైఎస్.. పులివెందుల నియోజకవర్గంలో ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు. రోజులు మొత్తం ఒకే విధంగా ఉండవు అన్నట్టు.. ఇప్పుడు పులివెందులలో పరిస్థితులు మారిపోతున్నాయి. వైసిపికి అక్కడ తిరుగులేదు అనే స్థాయి నుంచి.. ఫ్యాన్ పార్టీకి రెక్కలు పెరిగాయి అనే స్థాయికి దిగజారిపోయింది పరిస్థితి. ఇకపై ఎలా ఉంటుందో తెలియదు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఏ నాయకుడి నియోజకవర్గంలో కూడా ఏకగ్రీవాలు ఉండకూడదని.. కచ్చితంగా ఎన్నికల్లో గెలిచి చూపించాలని.. ఆదేశాలు జారీ చేశారు. అలా చేసిన నాయకులకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానంటూ జగన్ ప్రకటించారు. కానీ జగన్ నియోజకవర్గం లో 20 వార్డులు ఏకగ్రీవంగా ఉన్నాయి. దీంతో ఆయనకు తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఉన్న వార్డులలో కూడా పరిస్థితి దారుణంగా మారితే.. తన నాయకత్వానికి సవాళ్లు ఎదురవుతున్నప్పుడు జగన్ భావించారు. అందువల్లే ఆదివారం సొంత నియోజకవర్గానికి వచ్చారు. జగన్ రాక కంటే ముందే శనివారం నాడు పోలీసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. జగన్ పులివెందుల ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కాబట్టి.. తన ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లిపోవచ్చని.. కాన్వాయ్‌తో ప్రదర్శన చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలు.. రకరకాల పరిణామాలు జరిగిన నేపథ్యంలో పులివెందుల పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. వాస్తవానికి ఇది పులివెందులేనా అనే అనుమానం అక్కడి ఓటర్లలో ఉంది.

పులివెందులకు వచ్చిన జగన్ కు ఊహించని పరిణామం ఎదురైంది. జగన్ ర్యాలీకి దస్తగిరి ఎదురు వెళ్లారు. వివేక హత్య కేసులో దస్తగిరి ప్రధాన నిందితుడు. దస్తగిరి వచ్చాడని జగన్ కు వైసీపీ క్యాడర్ సమాచారం అందించారు. సొంత బాబాయిని చంపా అంటూ దస్తగిరి వ్యాఖ్యలు చేశారు. మా జీవితాలు నాశనం చేశావని దస్తగిరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. జగన్ ర్యాలీకి ఎదురు వెళ్లి.. దస్తగిరి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దీంతో అతడిని పోలీసులు పక్కకు పంపించారు. దస్తగిరిని జగన్ చూసి చూడనట్టు వెళ్లిపోయారు. నిజానికి దస్తగిరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని జగన్ ఊహించలేదు.

ఇప్పటికే సునీత తన తండ్రిని చంపిన వారిపట్ల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాదాపు ఆరేళ్లుగా ఆమె తనకు న్యాయం జరగాలని విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునిత వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రవర్తిస్తోంది. సాక్షి మీడియా కూడా అడ్డగోలుగా రాస్తోంది. ఆయన అయినప్పటికీ సునీత ధైర్యం విడవకుండా తన పోరాటాన్ని చేస్తున్నారు. చివరికి దస్తగిరి అసలు మరణాన్ని బయట పెట్టడంతో వివేక వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు.. ఎందుకు.. వారి ఉద్దేశం ఏమిటి అనే విషయాలు బయటకు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird