మలయాళ స్టార్ మమ్ముట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఆయన తెలుగులోనూ సినిమాలు చేశారు. స్వాతి కిరణం సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోటే సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగులో ఆయన ఆరు సినిమాలు చేశారు. మలయాళం ఆయన చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయి, హిట్ కూడా అవుతున్నాయి. మమ్ముట్టి 75ఏళ్ల వయసులోనూ తన అద్భుతమైన ఫిట్నెస్, స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.
తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. యువ హీరోలకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించిన తీరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొచ్చిలో జరిగిన ‘ప్రవేక ఫిల్మ్ కంపెనీ’ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన ఉన్నారు. ఈ కార్యక్రమం కోసం మమ్ముట్టి విభిన్నమైన, ట్రెండీ ఫ్యాషన్ శైలిని ఎంపిక చేసారు. ఆయన కంప్లీట్ వైట్ కలర్ రౌండ్-నెక్ టీషర్ట్, లూజ్ బ్యాగీ ప్యాంట్ ధరించి వేడుకకు విచ్చేశారు. ఈ మోనోక్రోమ్ దుస్తులకు మ్యాచింగ్ చేస్తూ టర్కోయిస్ కలర్ లోఫర్ షూస్ ధరించి తన లుక్కు మరింత కలర్‌ఫుల్ టచ్ ఇచ్చారు.
ఈ సరికొత్త ట్రెండీ లుక్‌లో ఆయనను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో మమ్ముట్టితో పాటు శరత్ కుమార్, దిలీప్, వినాయకన్, జోజు జార్జ్, ఎంపీ హిబీ ఈడెన్, సీనియర్ దర్శకుడు హరిహరన్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. మమ్ముట్టి లుక్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ” 75 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నాము. చూస్తుంటే 45 ఏళ్ల వ్యక్తిలా ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నారు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
2 యంగ్ స్టార్స్
https://t.co/pnYW6TIgwu
— క్రిస్టోఫర్ కనగరాజ్ (@Chrissuccess) అక్టోబర్ 24, 2026
The post ఈ వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా.. appeared first on iDreamPost.

