Home సినిమా సంగీత ప్రపంచంలో ప్రపంచం: ఇళయరాజా ఆస్థాన గిటారిస్ట్ కన్నుమూత.! – Andhra Waves

సంగీత ప్రపంచంలో ప్రపంచం: ఇళయరాజా ఆస్థాన గిటారిస్ట్ కన్నుమూత.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


సినిమా పాట అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సంగీత దర్శకుడు, గాయకుడు, గేయ రచయిత. కానీ ఒక పాటను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడంలో వాయిద్య కళాకారుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ముఖ్యంగా ఇళయరాజా సంగీతంలో గిటార్ వినిపిస్తే చాలు.. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించకుండా ఉండలేం. అలాంటి ఎన్నో మధురమైన పాటలకు తన గిటార్‌తో ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చిన సీనియర్ సంగీత విద్వాంసుడు సదా మాస్టర్ కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ సంగీత ప్రపంచంలో విషాదం.

ఎస్. సదానందం అలియాస్ సదా మాస్టర్ దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ప్రముఖ గిటార్ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం కుమారుడైన ఆయన.. చిన్నప్పటి నుంచే సంగీత వాతావరణంలో పెరిగారు.

ఇళయరాజా సంగీత బృందంలో నాలుగు దశాబ్దాలకు పైగా ప్రధాన గిటారిస్ట్‌గా పనిచేశారు. ఇళయరాజా సంగీత దర్శకుడిగా పరిచయమైన ‘అన్నకిళి’ సినిమా నుంచి ఆయనతో కలిసి చేశారు. అలా వేలాది పాటలకు తన గిటార్ సంగీతాన్ని అందించారు. ఎన్నో పాటల్లో ప్రారంభ సంగీతం, మధ్యలో వచ్చే వాయిద్యాల బిట్స్‌లో ప్రత్యేకంగా వినిపించడానికి సదా మాస్టర్ వంటి కళాకారుల ప్రతిభ కూడా ఒక కారణం.

తనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేసిన సదా మాస్టర్ మరణవార్తపై ఇళయరాజా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తన తొలి రోజుల నుంచే తనతో ఉన్నారని గుర్తుచేసుకున్నారు. తనతో కలిసి జీవించినవారిని, తన జీవితంలో అంతర్భాగమైనవారిని మరణించినవారిగా చూడలేనని భావోద్వేగంగా పేర్కొన్నారు. సదానందం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

ఇది కూడా చదవండి: బాలయ్య vs మంచు మనోజ్.. క్లైమాక్స్‌కు వచ్చేసిన ‘దాదా’.!

[Guitarist Sada Master Passed Away, Ilaiyaraaja Guitarist Sada Master, Sada Master Passes Away, Ilaiyaraaja Guitarist, Ilaiyaraaja Music Team, Sadanandam Guitarist, Ilaiyaraaja, Sada Master]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird