
కేటీఆర్: గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల కాలంలో పదేపదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగుడుతున్నారు. తాజాగా తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయకత్వాన్ని మరోసారి ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని.. ఏపీ రాష్ట్రంలో కూడా ఇలానే ఉందని.. చంద్రబాబు నాయుడు సరిగ్గా పరిపాలిస్తున్న నేపథ్యంలో.. ఏపీలో కరువు కనిపించడం లేదని.. ప్రతికూల పరిస్థితులనూ తనకు అనుకూలంగా మార్చుకున్నారని.. అది చంద్రబాబు నాయకత్వానికి నిదర్శనమని కేటీఆర్ అంటున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరువు ఉందని.. కానీ తెలంగాణలో దాని తీవ్రత ఎక్కువగా కనిపిస్తోందని.. దీనంతటికీ ప్రధాన కారణం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
నీటిని సమర్థంగా వాడుకోవడంలో చంద్రబాబు చాకచక్యాన్ని చూపిస్తున్నారని.. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారని.. ఏపీ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ.. నీటి నిల్వ.. నిర్వహణ విషయంలో చంద్రబాబు సమర్థత ప్రదర్శించారని.. రైతులను.. ప్రజలను ఆదుకుంటున్నారని కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా నీరు.. రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల.. ప్రణాళికలు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం అవసరం లేదని.. కమీషన్ ఇస్తే సరిపోతుందని కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ పనితీరు మీద రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు బలమైన నిదర్శనమని కేటీఆర్ అన్నారు.
కొండ సురేఖ తనకు క్షమాపణ చెప్పిన తీరుని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. నిజం నిలకడగా ఉంటుందని.. మొన్న ఒక పత్రిక.. ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని వివరించారు. ఆమె ఇచ్చిన వివరణ చూడలేదని.. లేఖను పరిశీలించిన తర్వాత.. తమ న్యాయ బృందంతో చర్చించి.. తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. రాజకీయంగా కక్ష సాధింపు కోసం.. తమపై అసత్యాలు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరు.. పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పక తప్పదని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ మీద ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేసు నమోదు చేసింది. ఒప్పందం కూడా కేటీఆర్ స్పందించారు. త్వరలోనే రేవంత్ బోనులో నిలబడక తప్పదని తెలుస్తుంది. పరిపాలన చేయడం చేతగాక ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ.. రేవంత్ కాలం గడుపుతున్నారని.. కరువులోన రైతులను ఆదుకోవడంలో రేవంత్ విఫలమయ్యారని.. ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకోవాల్సిన విధానాలను ఒంట పట్టించుకోవాలని సూచించారు. గతంలో చంద్రబాబును కేటీఆర్. కెసిఆర్ కూడా. ఇప్పుడు వాస్తవం తెలుసుకొని చంద్రబాబు పరిపాలనను కొనియాడుతున్నారు. కేటీఆర్ విషయంలో సురేఖ కైతే ఏ విధంగా జ్ఞానోదయం కలిగిందో.. చంద్రబాబు విషయంలో కూడా కేటీఆర్ కు అదే విధంగా జ్ఞానోదయం కలిగిందని టీడీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్న
– కేటీఆర్ https://t.co/bB1U4mMkTb
— (@Shiva4TDP) అక్టోబర్ 29, 2026
