Home సినిమా చిరంజీవి, అమల సూపర్ హిట్ సాంగ్: 36 ఏళ్లైనా తగ్గని క్రేజ్..ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్! – Andhra Waves

చిరంజీవి, అమల సూపర్ హిట్ సాంగ్: 36 ఏళ్లైనా తగ్గని క్రేజ్..ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


పాటల ప్రేమికులు నిత్యం ఈ సూపర్ హిట్ మెలోడీ ని మనసారా వీక్షిస్తూ ‘ఆహా ఏమి రుచి తినరా మైమరిచి రోజు తిన్నా మరి బోరే కొట్టనిది… నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా అనే ఘనతని తిరిగి పాట రూపంలోనే అందించి తమ జన్మ చరితార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే సంగీత ప్రియులకి పాటే భోజనం,ఆరాధన.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మాస్ మరియు క్లాస్ మెస్మరైజింగ్ డ్యాన్స్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాలలో ‘రాజా విక్రమార్క’ ఒకటి. సరిగ్గా 36 ఏళ్ల క్రితం 1990 నవంబర్ 12 న విడుదలైన కొత్త రకం జోనర్స్ కి ట్రెండ్‌సెట్టర్‌గా మారింది. చిరంజీవి సరసన అమల జత కట్టగా రాధిక మరో హీరోయిన్. అన్ని పాటలు అప్పట్లో మారుమోగిపోగా, ముఖ్యంగా చిరంజీవి, అమల కాంబోలో వచ్చిన ‘కొండ కోన తాంబూలాలే ఇచ్చేనంట.. కోకిలమ్మ పేరంటానే వచ్చేనంట’ సాంగ్ అపురూపమైన మ్యూజికల్ మాస్టర్‌పీస్. ప్రముఖ సంగీత ద్వయం రాజ్ కోటి అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఈ పాటకి ప్రాణం పోశాయి. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్, అమల అద్భుతమైన అభినయం ప్రేక్షకులను కట్టిపడేశాయి. కాలం మారుతున్న కొద్దీ ఎన్నో కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ, ఈ క్లాసిక్ సాంగ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం అణగారలేదు. దాదాపు 36 ఏళ్లు గడుస్తున్నా, ఈ ఎవర్ గ్రీన్ మెలోడీకి సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్‌లో ఆదరణ మరింత పెరుగుతూనే ఉంది. యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్ ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటూ అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఒక్క ‘కొండ కోన’ యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుండటం విశేషం. దీన్ని బట్టి ఈ సాంగ్ ని ఎంతలా అభిమానులు, ప్రేక్షకులు ఆస్వాదిస్తూ ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉన్న తేడా ఇదే: శుభలేఖ సుధాకర్ వ్యాఖ్యలు వైరల్!

ఎంత కొత్త మ్యూజిక్ వచ్చినా ఇలాంటి క్లాసికల్ మెలోడీ సాంగ్స్‌కు ఉండే ప్రత్యేకత ఎప్పుడూ చెక్కుచెదరదు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్, అమల అద్భుతమైన అభినయం సూపర్. మరి వినకపోతే వెంటనే వినేసేయండి. సమస్త టెన్షన్స్ ప్రకృతి సాక్షిగా హామ్ ఫట్.

[Chiranjeevi And Amala Raja Vikramarka Song Records, Konda Kona Thamburane Ichenanta song records, Chiranjeevi, Amala, Raja Vikramarka song, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird