
ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడనంటున్నాయి. అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెడద కొనసాగుతుందని హెచ్చరించింది.
.webp)
మరీ ముఖ్యంగా అర్నాబ్ ధాటికి తీవ్రంగా ప్రభావవంతమైన కోస్తాంధ్ర, యానాం పరిసరాల్లో భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కొన్ని ప్రాంతాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అర్నాబ్ తుపాను సృష్టించిన విలయంతో ఇప్పటికే కోస్తా తీరం అస్తవ్యస్తం కాగా, తాజాగా వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో తీరప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. అలాగే రాయలసీమ జిల్లాల్లోనూ రానున్న నాలుగు రోజుల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.
[AP weather Alert, Heavt Rains, One More, Week, IMD, Caution, Telugu One]
