Home Latest News రామోజీరావు ఒక ఎన్ సైక్లోపీడియా: యువతకు మార్గదర్శి.! | రామోజీ రావు సక్సెస్ స్టోరీ | మార్గదర్శి చిట్ ఫండ్ చట్టపరమైన పోరాటాలు | DN ప్రసాద్ | TeluguOne జర్నలిస్ట్ ఎపిసోడ్ | | తెలుగు మీడియా రామోజీ రావు – Andhra Waves

రామోజీరావు ఒక ఎన్ సైక్లోపీడియా: యువతకు మార్గదర్శి.! | రామోజీ రావు సక్సెస్ స్టోరీ | మార్గదర్శి చిట్ ఫండ్ చట్టపరమైన పోరాటాలు | DN ప్రసాద్ | TeluguOne జర్నలిస్ట్ ఎపిసోడ్ | | తెలుగు మీడియా రామోజీ రావు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


తెలుగు మీడియా రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి, దశాబ్దాల పాటు పత్రికా రంగాన్ని శాసించిన ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలను ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్ తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో ఎపిసోడ్‌లో తెలుగువన్ ఎండీ రవిశంకర్‌తో పంచుకున్నారు.

ఇందులో ప్రధానంగా రామోజీరావు అసాధారణ పాలనా శైలి, నిర్ణయాలు తీసుకునే విధానం, ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆయన చేసే కసరత్తు గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏ రంగాన్ని ఎంచుకోవాలో సరే, ఆ రంగంపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకోవడం, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో, పోటీదారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది రామోజీరావు సమగ్ర అధ్యయనం చేసేవారని డీఎన్ ప్రసాద్ చెప్పారు. ఒక బిజినెస్ ప్లాన్ వేసేటప్పుడు దాని తుది ఫలితాన్ని ముందుగానే ఊహించగలగడం రామోజీరావు ప్రత్యేకత అన్నారు. కేవలం పత్రికా రంగమే కాకుండా ప్రియా పచ్చళ్లు వంటి వ్యాపారాలలో కూడా ఆయన ఇదే సూత్రాన్ని పాటించి అగ్రగామిగా నిలిచారని గుర్తుచేశారు.

అలాగే.. మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు గ్రూప్‌పై గతంలో జరిగిన రాజకీయ దాడులు, ప్రత్యర్థుల నుంచి ఎదురైన తీవ్రమైన ఒళ్లు గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొన్ని వర్గాలు రామోజీరావు, ఆయన సంస్థలను ఇబ్బంది పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయని, మార్గదర్శిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక అడ్డంకులు సృష్టించారని. అనారోగ్యంతో మంచంపై ఉన్న సమయంలోనూ వేధింపులకు గురిచేసేలా కుట్రలు పన్నారని, అయినప్పటికీ రామోజీరావు ఎక్కడా వెనకడుగు వేయకుండా, ఆత్మస్థైర్యంతో ప్రతిఘటించారని గుర్తు చేశారు. చట్టబద్ధమైన పోరాటాలు చేస్తూనే వ్యవస్థల ఒత్తిళ్లను ఆయన సమర్థంగా ఎదుర్కొన్న తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.

రామోజీరావును ఒక ఎన్సైక్లోపీడియాగా డీఎన్ ప్రసాద్ అభివర్ణించారు. కష్టాలను ఎదుర్కొనే సమయంలో ఆయన చూపిన తెగింపు, తెగువ ఏ పరిస్థితులలోనూ భయపడకుండా ముందుకు సాగే నైజం నేటి యువతరానికి ఒక పాఠంగా చెప్పారు. రామోజీరావు తన జీవిత కాలంలోనే తన సమాధిని కూడా స్వయంగా డిజైన్ చేసుకున్నారని, దేవుడి కంటే తన కష్టాన్ని, నమ్మకాన్ని మాత్రమే నమ్ముకున్న మహోన్నత వ్యక్తి అని డీఎన్ ప్రసాద్ చెప్పారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, ఈనాడు పత్రికను, సంస్థలను దెబ్బతీయాలని చూసినా, ప్రజల మద్దతు, నమ్మకమే ఆ సామ్రాజ్యాన్ని నిలబెట్టాయని స్పష్టం చేశారు. ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుల జీవితం నుంచి నేటి యువత, వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి, కష్టనష్టాలు ఎదురైనప్పుడు అధైర్య పడకుండా లక్ష్యం వైపు ఎలా అడుగులు వేయాలో రామోజీరావు జీవితమే నేర్పింది.


[Ramoji Rao Success Story, Margadarsi Chit Fund Legal Battles, DN Prasad, TeluguOne Journalist Episode, , Telugu Media Ramoji Rao, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird