
సత్యసాయి జడ్పీ చైర్మన్ బరిలో పరిటాల శ్రీరామ్ దిగనున్నారు. సత్యసాయి జెడ్పీ చైర్మన్ రేసులో పరిటాల రవిని నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అయితే జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు. పరిటాల శ్రీరామ్ విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.
ఒక నల్ల చెరువు జెడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు, కూటమి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల ముఖ్య నేతలు, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పరిటాల శ్రీరామ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. తద్వారా పార్టీల మధ్య ఐక్యతను చాటాలని కూటమి.

పరిటాల కుటుంబానికి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ ఉంది. అలాంటి కుటుంబానికి చెందిన యువ నాయకుడు జిల్లా స్థాయి పదవి బాధ్యతల్లోకి అడుగుపెడుతూ స్థానిక శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. నల్లచెరువు నుంచి ప్రారంభం కానున్న ఈ రాజకీయ ప్రయాణం, శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ పీఠం కైవసంతో ముగుస్తుందని తెలుగుదేశం నాయకత్వం ధీమాగా చెబుతోంది.
[Paritala Sriram ZP Chairman Race, Sri Sathya Sai District, ZPTC Member Nallacheruvu, Nomination, TDP, Andhra Pradesh, AP politics, Telugu One]
