Home Latest News IND vs NZ: సంజు శాంసన్ విధ్వంసం..ఉత్కంఠ పోరులో సంపూర్ణ జయభేరి.! | ఇండియా vs న్యూజిలాండ్ T20 | టీమ్ ఇండియా | సంజు శాంసన్ | నమన్ | శ్రేయాస్ అయ్యర్ | గ్లెన్ ఫిలిప్స్ | టీ20లో భారత్ విజయం | క్రికెట్ వార్తలు తెలుగు – Andhra Waves

IND vs NZ: సంజు శాంసన్ విధ్వంసం..ఉత్కంఠ పోరులో సంపూర్ణ జయభేరి.! | ఇండియా vs న్యూజిలాండ్ T20 | టీమ్ ఇండియా | సంజు శాంసన్ | నమన్ | శ్రేయాస్ అయ్యర్ | గ్లెన్ ఫిలిప్స్ | టీ20లో భారత్ విజయం | క్రికెట్ వార్తలు తెలుగు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో జరిగిన అద్భుత పోరాట పటిమను చాటుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేలా భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ సహా పలువురు బ్యాటర్లు కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు ఛేదనకు బలమైన పునాది వేశాడు. అతడి దూకుడుతో భారత జట్టు ఆరంభం నుంచే లక్ష్యం దిశగా దూసుకెళ్లింది.

మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా 29 పరుగులు చేసి జట్టుకు విలువైన సహకారం అందించాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడాడు. నమన్ ధీర్ కూడా 42 పరుగులు చేసి కీలక సమయంలో జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 24 పరుగులు జోడించడంతో భారత్ విజయానికి చేరువైంది.

చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కివీస్ బౌలర్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచినా, భారత బ్యాటర్లు లక్ష్య ఛేదనలో పట్టుదల ప్రదర్శించారు. శ్రేయస్, నమన్ నిలకడగా ఆడి జట్టును విజయంవైపు నడిపించారు. చివర్లో శ్రేయస్ ఔటైనా నమన్, నితీశ్ మ్యాచును ముగించారు. దీనితో 5 మ్యాల సిరీస్‌లో భారత్1-0తో లీడ్.

[  India vs New Zealand T20, Team India, Sanju Samson, Naman, Shreyas Iyer, Glenn Phillips, India T20 Victory, Cricket News Telugu, TeluguOne News ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird