Home సినిమా ప్రేమలు హీరో రిస్క్ చేస్తున్నాడా? – iDreamPost – Andhra Waves

ప్రేమలు హీరో రిస్క్ చేస్తున్నాడా? – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
ప్రేమలు హీరో రిస్క్ చేస్తున్నాడా? - iDreamPost


నస్లెన్ కే గఫార్ అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టలేరు కానీ, ప్రేమలు హీరో అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రేమలు సినిమాతో నస్లెన్ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో అమాయకమైన యువకుడి పాత్రతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నాలుగు సినిమాలు చేసినా.. ప్రేమలు సచిన్‌గానే ప్రేక్షకులకు గుర్తిండిపోయాడు. ‘ప్రేమలు’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నస్లెన్‌.. ఇప్పుడు తన ఇమేజ్‌కి పూర్తి భిన్నమైన పాత్రను ఎంచుకున్నాడు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘సీన్’ సినిమాలో క్రూరమైన విలన్‌గా కనిపించేందుకు సిద్ధమయ్యాడు. ఒక హిట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటులు అదే ఇమేజ్‌ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు. కానీ, నస్లెన్‌ మాత్రం విలన్‌ పాత్రతో కొత్త ప్రయోగానికి తెరతీశాడు.

నస్లెన్ తీసుకున్న ఈ నిర్ణయం అతడి కెరీర్‌కు తప్పటడుగు అవుతుందా? లేక నటుడిగా మరో మెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుందా? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ప్రేక్షకులు ఒక నటుడిని ఓ ప్రత్యేకమైన పాత్రలో చూసి ఇష్టపడతారు. అతడిని మరో భిన్నమైన పాత్రలో అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా అమాయకమైన ప్రేమికుడిగా గుర్తింపు తెచ్చుకున్న నస్లెన్‌.. క్రూరమైన కిల్లర్‌గా ప్రేక్షకులను మెప్పించడం అనేది రిస్క్ అని చెప్పాలి.

ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా కొత్త ప్రయోగాలు చేయడం నటుడిగా ఎదగడానికి అవసరమే. విలన్‌ పాత్రను సమర్థంగా పోషించే, నస్లెన్‌లోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయం కావడంతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. , సూర్య స్టార్‌తో స్క్రీన్‌ షేర్‌ లాంటిది అతనికి పైగా మరో గుర్తింపు తెచ్చుకోవచ్చు. నస్లెన్ పాత్ర ఎంత బలంగా ఉంటుంది.. అతడు దాన్ని సినిమాలో ఎంత సమర్థంగా పోషించాడు అన్నదే అసలు విషయం. ఇది అతడి కెరీర్‌కు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతుందా? లేక ప్రేక్షకులు అతడిని ఇప్పటివరకు చూసిన ఇమేజ్‌కే పరిమితం చేస్తారా? అనేది.. మరి కొన్ని రోజుల్లో తేలబోతోంది.

రచయిత అవతార్

వెంకటేశ్వర్లు

నా పేరు వెంకటేశ్వర్లు. iDreamPost.comలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ సినిమా, జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. 2016లో జర్నలిజం వైపు వచ్చాను. జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి వెబ్ డెస్క్ నుంచి వృత్తిపర జర్నీ మొదలైంది. ఆ తర్వాత సుమన్ టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో సేవలను అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird